‘బార్డర్’లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి

న్యూఢిల్లీ : భారత్‌, చైనా సరిహద్దు(ఎల్ఏసీ)వద్ద నెలకొన్న పరిస్థితులను పారదర్శకంగా వెల్లడించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత కరోనా సంక్షోభకాలంలో బార్డర్ పరిస్థితులపై మౌనంగా ఉంటే వదంతులు వ్యాపిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అసలు సరిహద్దులో ఏం జరుగుతున్నదో దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ‘గత మూడు వారాలుగా ఎల్ఏసీ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. లడాఖ్, ఉత్తర సిక్కింలోని ఎల్ఏసీ […]

Update: 2020-05-29 07:57 GMT

న్యూఢిల్లీ : భారత్‌, చైనా సరిహద్దు(ఎల్ఏసీ)వద్ద నెలకొన్న పరిస్థితులను పారదర్శకంగా వెల్లడించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత కరోనా సంక్షోభకాలంలో బార్డర్ పరిస్థితులపై మౌనంగా ఉంటే వదంతులు వ్యాపిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అసలు సరిహద్దులో ఏం జరుగుతున్నదో దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ‘గత మూడు వారాలుగా ఎల్ఏసీ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. లడాఖ్, ఉత్తర సిక్కింలోని ఎల్ఏసీ దగ్గర ఇరువైపులా పెద్ద మొత్తంలో జవాన్లు మోహరించారు. ఇరువైపులా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నార‘ని రాహుల్ అన్నారు.

Tags:    

Similar News