తేడాలు వస్తే మీదే బాధ్యత..! కలెక్టర్లకు సర్కార్ ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మృతులను గుర్తించే విషయంలో తేడాలు వస్తే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా కరోనా మృతులను గుర్తించి 50 వేల నష్ట పరిహారాన్ని అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన బాధితులు వెంటనే అప్లై చేసుకోవాలన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారి వివరాలను పరిశీలించి […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మృతులను గుర్తించే విషయంలో తేడాలు వస్తే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా కరోనా మృతులను గుర్తించి 50 వేల నష్ట పరిహారాన్ని అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన బాధితులు వెంటనే అప్లై చేసుకోవాలన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారి వివరాలను పరిశీలించి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రత్యేక కొవిడ్ డెత్ సర్టిఫికేట్ ను ఇస్తుందన్నారు.దాన్ని జతచేస్తూ మీ సేవాలో పూర్తి అకౌంట్ వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 30 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.