మెడికల్ పీజీ సీట్ల భర్తీపై సర్కార్ కీలక నిర్ణయం.!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కోటాలో 50 శాతం మెడికల్ పీజీ సీట్లను భర్తీ చేసే ఇన్ సర్వీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించడానికి సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ, నిమ్స్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ కమిటీలో ఉన్నారు. ఇన్ సర్వీస్ విధానాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కోటాలో 50 శాతం మెడికల్ పీజీ సీట్లను భర్తీ చేసే ఇన్ సర్వీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించడానికి సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ, నిమ్స్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఈ కమిటీలో ఉన్నారు.
ఇన్ సర్వీస్ విధానాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో 2017 వరకు ఇన్ సర్వీస్ కోటా అమలులో ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్ట సవరణతో ఆ విధానం రద్దయింది. అయితే మళ్లీ రాష్ట్రంలో ఇన్ సర్వీస్ అమల్లోకి వస్తే, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న 850 పీజీ సీట్లు, ప్రైవేట్కాలేజీల్లో ఉన్న 1,100 సీట్లలో 50 శాతం రాష్ట్ర కోటాలోకి రానుండగా మిగతా వాటిని నేషనల్ పూల్‌కి వెళ్తాయి.