‘కరోనా మరణాలు దాచిపెడ్తున్నరు’

దిశ, హుజూర్‌నగర్: రాష్ట్రంలో కొవిడ్ టెస్టులు చేయడంలేదని, ప్రభుత్వం కరోనా మరణాలను దాచిపెడుతుందని టీపీసీసీ ఛీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని క్యాంపు ఆఫీస్‌లో ఉత్తమ్ సమక్షంలో టీఆర్ఎస్ బహిష్కృత మున్సిపల్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కండువా కప్పి ఆయనను పార్టీలో కి ఆహ్వానించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ… కరోనా పట్ల ప్రజల్లో […]

Update: 2021-05-22 05:21 GMT

దిశ, హుజూర్‌నగర్: రాష్ట్రంలో కొవిడ్ టెస్టులు చేయడంలేదని, ప్రభుత్వం కరోనా మరణాలను దాచిపెడుతుందని టీపీసీసీ ఛీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని క్యాంపు ఆఫీస్‌లో ఉత్తమ్ సమక్షంలో టీఆర్ఎస్ బహిష్కృత మున్సిపల్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కండువా కప్పి ఆయనను పార్టీలో కి ఆహ్వానించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ… కరోనా పట్ల ప్రజల్లో భయాందోళన కలగడం పూర్తిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.

కావాలనే కరోనా టెస్టులు ఆపుతున్నారని, మరణాల పట్ల ఆర్టిఫిషియల్ నెంబర్లు చూపుతున్నారని విమర్శించారు. హాస్పిటల్‌కు వచ్చినవారందరికీ టెస్టులు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడాది లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వసతులు కల్పించాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేదని గుర్తు చేశారు.

ప్రైవేటు ఆసుపత్రులు లక్షల్లో ఛార్జీ చేస్తున్నా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. బీపీఎల్ కు దిగువన ఉన్న కుటుంబాలకు పూర్తి ఉచితంగా ట్రీట్ మెంట్, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్,తన్నీరు మల్లిఖార్జున్,సాముల శివారెడ్డి,అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,దొంతిరెడ్డి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూదందాపై ఫిర్యాదు చేస్తాం

హుజూర్ నగర్ నియోజవర్గంలో జరుగుతున్న భూ దందా గురించి ప్రభుత్వ పెద్దలకు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అప్పటికీ చర్యలు తీసుకోకపోతే విషయాన్ని ప్రజల్లోకి, కోర్టు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్ నిబంధనలు పాటించకుండా గలీజుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమి అని కలెక్టర్, ఆర్డీఓలకు తెలియజేసినా నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఎవరికి ఎంత ముట్టాయో అని అనుమానం కలుగుతోందన్నారు. లాక్‌డౌన్ తర్వాత సీరియస్‌గా మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రతివిషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.

Tags:    

Similar News