వరంగల్‌లో Hyderabad పబ్లిక్ స్కూల్‌పై TS సర్కార్ కీలక నిర్ణయం.. జీవో జారీ
దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్‌లో ‘హైదరాబాద్‌పబ్లిక్ స్కూల్’ కోసం తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. హెచ్‌పీఎస్ సొసైటీకి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబరు 93ని సర్కార్ జారీ చేసింది. ఆ జీవో కాపీని మినిస్టర్స్క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం హెచ్పీఎస్సొసైటీ వైస్ చైర్మన్ గుస్తీ జే. నోరియాకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విద్యారంగంలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు […]
దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్‌లో ‘హైదరాబాద్‌పబ్లిక్ స్కూల్’ కోసం తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. హెచ్‌పీఎస్ సొసైటీకి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబరు 93ని సర్కార్ జారీ చేసింది. ఆ జీవో కాపీని మినిస్టర్స్క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం హెచ్పీఎస్సొసైటీ వైస్ చైర్మన్ గుస్తీ జే. నోరియాకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విద్యారంగంలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి గత ఐదేళ్లుగా అద్దె భవనంలో నడుస్తున్న హెచ్‌పీఎస్‌కు శాశ్వత స్కూల్ కోసం స్థలం కేటాయించామని అన్నారు. 1923లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బేగంపేటలో 122 ఎకరాల్లో ఇండో సారాసెనిక్ పద్ధతిలో భవనం నిర్మించి జాగిర్దార్ కాలేజీగా ప్రారంభించారన్నారు.
నిజాం శకం ముగిసిన తర్వాత 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా పేరు మార్చి సొసైటీ గవర్నింగ్ ఆధ్వర్యంలో హెచ్‌పీఎస్ నడుస్తున్నదని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి, మైక్రోసాప్ట్సీఈఓ సత్యనాదేళ్ల, ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకులు హర్షా భోగ్లే, విప్రో సీఈఓ కురియన్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, హీరోలు నాగార్జున, రామ్‌చరణ్, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందరో హెచ్‌పీఎస్‌లో చదువుకున్నట్టు వివరించారు. వరంగల్ ప్రాంతంలోని విద్యార్ధులను కూడా ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు.