బారు కావాలా..? ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక నెల ఫీజు మాఫీ

దిశ, తెలంగాణ బ్యూరో: బార్ల లైసెన్స్‌దారులకు ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బార్ల రెన్యూవల్​కు యజమానులు ముందుకు రాకపోవడంతో.. ఒక నెల లైసెన్స్​ ఫీజును మాఫీ చేస్తూ ప్రకటన చేసింది. బార్ల లైసెన్స్​ రెన్యూవల్​, కొత్త మద్యం పాలసీపై శుక్రవారం అబ్కారీ శాఖ కమిషనర్​ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. బార్ల లైసెన్స్​దారులు రెన్యూవల్​కు ముందుకు రావడం లేదని అన్ని జిల్లాల నుంచి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ కీలక నిర్ణయం […]

Update: 2021-09-17 09:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బార్ల లైసెన్స్‌దారులకు ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బార్ల రెన్యూవల్​కు యజమానులు ముందుకు రాకపోవడంతో.. ఒక నెల లైసెన్స్​ ఫీజును మాఫీ చేస్తూ ప్రకటన చేసింది. బార్ల లైసెన్స్​ రెన్యూవల్​, కొత్త మద్యం పాలసీపై శుక్రవారం అబ్కారీ శాఖ కమిషనర్​ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. బార్ల లైసెన్స్​దారులు రెన్యూవల్​కు ముందుకు రావడం లేదని అన్ని జిల్లాల నుంచి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్​ ఫీజులో ఒక నెల ఫీజును రాయితీగా ప్రకటించింది. అంటే ఉదాహరణగా జీహెచ్​ఎంసీ పరిధిలో బార్లకు రూ. 40 లక్షల లైసెన్స్​ ఫీజు ఉంటే.. ఇందులో రూ. 3.33 లక్షలు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బార్లకు రూ. 42 లక్షల లైనెన్స్​ ఫీజు ఉంటే రూ. 3.50 లక్షలు రాయితీ ఇస్తున్నారు. అయితే లైసెన్స్​ ఫీజు రెన్యూవల్​ను మాత్రం ఈ నెల 30లోగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News