ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చార్జీలు ఇలా

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కరోనా చికిత్సకు చార్జీలను నిర్ణయించింది. వాటిని రోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పాటించే ఆస్పత్రుల్లో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న రోగులకు వైద్యుల సూచనల మేరకే పరీక్షలు చేయాలి. ఇందుకు ఫీజు రూ.2,200గా నిర్ణయించారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రోజుకు రూ. 7,500, ఐసోలేషన్‌లో ఉంచితే […]

Update: 2020-06-15 10:32 GMT

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కరోనా చికిత్సకు చార్జీలను నిర్ణయించింది. వాటిని రోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పాటించే ఆస్పత్రుల్లో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న రోగులకు వైద్యుల సూచనల మేరకే పరీక్షలు చేయాలి. ఇందుకు ఫీజు రూ.2,200గా నిర్ణయించారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రోజుకు రూ. 7,500, ఐసోలేషన్‌లో ఉంచితే రోజుకు రూ.4,000, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రోజుకు రూ. 9,000 చార్జి వసూలు చేయవచ్చు. అయితే యాంటి వైరల్ డ్రగ్ అవసరమైతే సపరేట్ చార్జీలు వసూలు చేయవచ్చని పేర్కొంది.

తమిళనాడులో వసతులను బట్టి ఆసుపత్రులను గ్రేడులుగా విభజించింది అక్కడి ప్రభుత్వం. ఏ1, ఏ2 ఆసుపత్రుల్లోని జనరల్ వార్డుల్లో రోజుకు ఒక రోగికి రూ.7,500, ఐసీయూలో అయితే రూ.15,000 వసూలు చేయనున్నారు. ఏ3, ఏ4 ఆస్పత్రులలోని జనరల్ వార్డుల్లో రూ. 5000, ఐసీయూలో అయితే రూ.15 వేల చార్జీ వసూలు చేసుకోవచ్చు. ఇక మహారాష్ట్రలో.. ప్రైవేట్ ఆస్పత్రులలోని వార్డులు, ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తే రోజుకు రూ.4000, ఐసీయూ బెడ్, వెంటిలేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తే రూ.9000, ఐసోలేషన్ లేకుండా ఐసీయూ, వెంటి‌లేటర్ సౌకర్యం కల్పిస్తే రూ 7,500 ఫీజుగా వసూలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Tags:    

Similar News