తిరుమన్‌పల్లి, గర్గుల్‌లో పర్యటించిన సీఎస్

దిశ, నిజామాబాద్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. శుక్రవారం బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాసదాశివనగర్ మండలం తిరుమన్‌పల్లి, గర్గుల్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు హరితహారం, మురుగు కాలువల శుద్ధీకరణ, ఇంటింటికి తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డు, స్మశాన వాటికల పనుల […]

Update: 2020-06-05 00:57 GMT

దిశ, నిజామాబాద్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. శుక్రవారం బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాసదాశివనగర్ మండలం తిరుమన్‌పల్లి, గర్గుల్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు హరితహారం, మురుగు కాలువల శుద్ధీకరణ, ఇంటింటికి తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డు, స్మశాన వాటికల పనుల నిర్వహణ, వ్యవసాయ పంటలు తదితర అంశాలపై, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా పంచాయతీ కమిషనర్ రఘునందన్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు ర్యాండమ్‌గా రెండు గ్రామాల్లో సర్వే చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు, హరితహరం, నియమిత పంటల సాగుపై ప్రధానంగా పరిశీలన చేసినట్టు పేర్కొన్నారు. సర్వే నివేదికను ప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు.

Tags:    

Similar News