జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తోన్న విషయం తెలిసిందే. మూడోదశలో మే 17వ తేదీ వరకు పొడిగించారు. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. ఉద్యోగులకు జీతాల్లేవ్. దీంతో ఈఎమ్ఐతో పాటు పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సామాన్యులకు ఊరట కల్పిస్తోంది. తాజాగా వార్షిక జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని 3 నెలలు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తోన్న విషయం తెలిసిందే. మూడోదశలో మే 17వ తేదీ వరకు పొడిగించారు. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. ఉద్యోగులకు జీతాల్లేవ్. దీంతో ఈఎమ్ఐతో పాటు పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సామాన్యులకు ఊరట కల్పిస్తోంది. తాజాగా వార్షిక జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని 3 నెలలు పొడిగించి సెప్టెంబర్ 2020 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) మార్చి 24, అంతకుముందు బిల్లులకు సంబంధించిన ఈ-వే బిల్స్ వ్యాలిడిటీని పొడిగించింది. సాధారణంగా అయితే ఈ గడువు మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీకి ముగిసింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ రిటర్న్స్ కాలపరిమితిని 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీబీఐసీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోందని, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో పొడిగింపు పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగిస్తుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీబీఐసీ గత నెలలో మార్చి 24, అంతకుముందు జనరేట్ అయిన ఈ-వే బిల్లులకు సంబంధించి వ్యాలిడిటీని పొడిగించింది. లాక్ డౌన్ పొడిగింపు దృష్ట్యా దీనిని మే 31 వరకు పొడిగించారు.
Tags: Goods And Services Tax, India, lockdown extended, govt extend gst return filing