సర్కారు వారి ఊయల..
దిశ, వెబ్‌డెస్క్ : పుట్టిన పసి పిల్లలను పోషించే స్థోమత కరువవడం, ఇతర కారణాలతో కొందరు శిశువులను మురుగు కాల్వల్లో, చెత్తకుప్పల్లో పడేసి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్‌కు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనాథ శిశువులను ఆదుకోవడానికి వినూత్న ఆలోచన చేశారు. పోషించే శక్తి లేని తల్లిదండ్రుల నుంచి శిశువులను అక్కున చేర్చుకుని వారి బాగోగులను చూసుకోవడానికి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ‘సర్కారీ వారి […]
దిశ, వెబ్‌డెస్క్ : పుట్టిన పసి పిల్లలను పోషించే స్థోమత కరువవడం, ఇతర కారణాలతో కొందరు శిశువులను మురుగు కాల్వల్లో, చెత్తకుప్పల్లో పడేసి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్‌కు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనాథ శిశువులను ఆదుకోవడానికి వినూత్న ఆలోచన చేశారు.
పోషించే శక్తి లేని తల్లిదండ్రుల నుంచి శిశువులను అక్కున చేర్చుకుని వారి బాగోగులను చూసుకోవడానికి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ‘సర్కారీ వారి ఊయల’ను ఏర్పాటు చేశారు. ‘పుట్టిన పసిగుడ్డుల్ని చంపకండి.. ఈ ఊయలలో వేసి జీవం పోయండి’ అని సూచిస్తున్నారు.