సత్తాచాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
దిశ, న్యూస్‌బ్యూరో: ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడీయట్ ఫలితాల్లో ప్రభుత్వం కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ స్థాయితో పోటీపడి మార్కులు సంపాదించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అభినందించింది. సెకండియర్ ఎంపీసీలో సిద్దిపేట విద్యార్థిని ఈ. సువర్ణ (978), మహబూబ్‌నగర్ విద్యార్థి ఎం. వంశీ (974), బైపీసీలో ఎన్.మనస్వి (983–మేడ్చల్), ఎంఈసీలో ఎల్. హారిక (964–మేడ్చల్) అత్యధిక మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో గన్‌ఫౌండ్రీ జూనియర్ కళాశాల నుంచి అప్సాన్ జబీన్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడీయట్ ఫలితాల్లో ప్రభుత్వం కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ స్థాయితో పోటీపడి మార్కులు సంపాదించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అభినందించింది. సెకండియర్ ఎంపీసీలో సిద్దిపేట విద్యార్థిని ఈ. సువర్ణ (978), మహబూబ్‌నగర్ విద్యార్థి ఎం. వంశీ (974), బైపీసీలో ఎన్.మనస్వి (983–మేడ్చల్), ఎంఈసీలో ఎల్. హారిక (964–మేడ్చల్) అత్యధిక మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో గన్‌ఫౌండ్రీ జూనియర్ కళాశాల నుంచి అప్సాన్ జబీన్ (428–బైపీసీ), సిద్దిపేట నుంచి కె.దేశిల్ కుమార్ (427–బైపీసీ), సీఈసీలో పి.దీపక్ (477– హైదరాబాద్), హెచ్ఈసీలో టిఎస్. వీరేష్ (481– జోగులాంబ గద్వాల) జిల్లా నుంచి అత్యధిక మార్కులను సాధించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉచితంగా విద్యాబోధన, పుస్తకాలను అందించడంతో పాటు అధ్యాపకుల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఈ ఫలితాలను సాధించినట్టు విద్యామండలి కార్యదర్శి పేర్కొన్నారు.