ఆనందయ్య మందుకు ప్రభుత్వ ఆమోదం.. నేటి నుంచి తిరిగి పంపిణీ
దిశ, ఏపీ బ్యూరో: కరోనా నివారణకు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో యథావిధిగా మందు పంపిణీ చేయొచ్చని ఆమోదం తెలిపింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన మూలికలతో ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు తీసుకోవడం వల్ల ఎటువంటి హానీ ఉండదని ఆయుర్వేద నిపుణలు స్పష్టం చేశారు. వివిధ రాష్ర్టాలు, […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా నివారణకు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో యథావిధిగా మందు పంపిణీ చేయొచ్చని ఆమోదం తెలిపింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన మూలికలతో ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు తీసుకోవడం వల్ల ఎటువంటి హానీ ఉండదని ఆయుర్వేద నిపుణలు స్పష్టం చేశారు. వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వస్తున్న ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మందు పంపిణీ చేయాలని జిల్లా అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, విపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేశారు.