మహిళా కానిస్టేబుల్‌కు గవర్నర్ అభినందనలు..
దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలియజేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న డి.శివరాణి ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక ఎన్‌సీఆర్‌బీ అవార్డుకు ఎంపిక కావడంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. క్రైమ్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్), క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఈ ఏడాది శివరాణి ఎన్‌సీఆర్‌బీ ద్వారా అవార్డుకు ఎంపికైన సంగతి తెల్సిందే. ఈ […]
దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలియజేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న డి.శివరాణి ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక ఎన్‌సీఆర్‌బీ అవార్డుకు ఎంపిక కావడంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. క్రైమ్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్), క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఈ ఏడాది శివరాణి ఎన్‌సీఆర్‌బీ ద్వారా అవార్డుకు ఎంపికైన సంగతి తెల్సిందే.
ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ శివరాణికి స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖ రాసి అభినందించారు. తెలంగాణ పోలీసు శాఖ పనితీరును దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందులో మహిళా కానిస్టేబుల్ శివరాణి ఎంటెక్ చదువుకున్నట్టు తెలుసుకున్న గవర్నర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో టెక్ టీమ్ మెంబర్‌గా కొనసాగడం గొప్ప విషయం అన్నారు. ఇలాంటి విజయాలు, బహుమతులను భవిష్యతులో మరిన్ని అందుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.