Google Chrome వాడే వారికి షాకింగ్ న్యూస్..

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరీకను జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, గూగుల్ క్రోమ్ యూజర్లు సైబర్ మోసగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని యూజర్లు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, కంప్యూటర్ పై గూఢచర్యం చేయడానికి మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేసే […]

Update: 2021-12-14 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరీకను జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, గూగుల్ క్రోమ్ యూజర్లు సైబర్ మోసగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని యూజర్లు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, కంప్యూటర్ పై గూఢచర్యం చేయడానికి మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి Google Chrome వినియోగదారులు కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ కావాలి.

ఒకవేళ కొత్త వెర్షన్‌కి అప్‌డేట్ కాకపోతే, హ్యాకర్స్ కంప్యూటర్ పై దాడి చేసి సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది. google ఇటీవల క్రోమ్ స్టేబుల్ ఛానెల్‌ని Windows, Mac, Linux కోసం 96.0.4664.93కి అప్‌డేట్ చేసింది. గూగుల్ కొత్త వెర్షన్ కోసం స్క్రీన్ కుడి వైపున పై భాగంలో అప్‌డేట్ పై క్లిక్ చేయాలి.

హైదరాబాదీలే ఆ పనిలో టాప్.. తేల్చిన డేటింగ్ యాప్ సర్వే!

Tags:    

Similar News