యువకుడిని చితకబాదిన గౌరారం పోలీసులు
దిశ: గజ్వేల్ /వర్గల్: ఓ యువకుడిని గౌరారం పోలీసులు లాఠాతో చితకబాదారు . వర్గల్ మండలం నాచారం గ్రామానికి చెందిన నంబి సురేష్ (32) యువకుడు నాచారంగుట్ట వద్ద నున్న వైన్స్ షాపులో మద్యం తీసుకోవడానికి వెళ్ళాడు. వైన్స్ షాపు వద్ద చిన్న పాటి సంఘర్షణ కారణంగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికంగా నెలకొల్పిన ఔట్ పోస్ట్ నుండి వైన్స్ వద్దకు చేరుకున్న గౌరారం పోలీసులు లాఠీకి పని చెప్పి యువకుడిని చితకబాదారు. దీంతో […]
దిశ: గజ్వేల్ /వర్గల్: ఓ యువకుడిని గౌరారం పోలీసులు లాఠాతో చితకబాదారు . వర్గల్ మండలం నాచారం గ్రామానికి చెందిన నంబి సురేష్ (32) యువకుడు నాచారంగుట్ట వద్ద నున్న వైన్స్ షాపులో మద్యం తీసుకోవడానికి వెళ్ళాడు. వైన్స్ షాపు వద్ద చిన్న పాటి సంఘర్షణ కారణంగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికంగా నెలకొల్పిన ఔట్ పోస్ట్ నుండి వైన్స్ వద్దకు చేరుకున్న గౌరారం పోలీసులు లాఠీకి పని చెప్పి యువకుడిని చితకబాదారు.
దీంతో సురేష్‌కు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చి తూప్రాన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే తీవ్ర గాయాలై సృహ కోల్పోయాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మద్యం షాపు వాళ్ళు ఇచ్చే మాముళ్ళకు అలవాటు పడ్డ పోలీసులు స్థానికులను చితకబాదడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సురేష్‌కు ఏలాంటి ప్రాణపాయం తలెత్తిన పోలీసులే భాధ్యత వహించాలంటూ కుటుంబీకులు పేర్కొంటున్నారు. కాగా గాయపర్చిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని యువకుడి తల్లి నర్సమ్మ, తమ్ముడు ప్రవీణ్‌లు తెలిపారు. ఫ్రేండ్లీ పోలీస్ అంటే ఇదేనా అంటూ పోలీసుల తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.