మేయర్ ఎన్నికకు వెళ్తూ ఉత్సాహంగా గోరేటి పాట
దిశ,వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు వెళ్తూ.. శాసన మండలి సభ్యుడు, రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న ఉత్సాహంగా పాట పాడారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు గురువారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బస్సులో వెళ్లారు. తన పాటతో నూతన కార్పొరేటర్లలో గోరేటి వెంకన్న ఉత్సాహాన్ని నింపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి కొత్తగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగులో బీజేపీ, […]
దిశ,వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు వెళ్తూ.. శాసన మండలి సభ్యుడు, రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న ఉత్సాహంగా పాట పాడారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు గురువారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బస్సులో వెళ్లారు. తన పాటతో నూతన కార్పొరేటర్లలో గోరేటి వెంకన్న ఉత్సాహాన్ని నింపారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి కొత్తగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగులో బీజేపీ, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉర్దూలో ఎంఐఎం కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. పలువురు మాత్రం హిందీ, ఇంగ్లీష్‌లో కూడా ప్రమాణ స్వీకారం చేశారు.