మార్చిలో గూగుల్‌ ట్రెండ్స్ ఇవే!

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటిలాగే తమ నెలవారీ ట్రెండ్స్ఒక జాబితాను గూగుల్ వెల్లడించింది. అయితే మార్చి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఉండటంతో ఇంట్లోనే గడుపుతున్న ప్రజలు ఎలాంటి విషయాలు ఎక్కువ సెర్చ్ చేశారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఒకవైపు కరోనా భయం, మరోవైపు క్వారంటైన్… తమకు కావాల్సినవి ఇంటర్నెట్లో ఉన్నాయో లేవోనని ఎంతోమంది సెర్చింగులు మొదలుపెట్టారు. హెల్త్‌కేర్ విభాగంలో ఎమర్జెన్సీ హెల్త్ కేర్ బెనిఫిట్, సీడీసీ హెల్త్‌కేర్ వర్కర్ల గైడ్‌లైన్స్ […]

Update: 2020-04-09 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటిలాగే తమ నెలవారీ ట్రెండ్స్ఒక జాబితాను గూగుల్ వెల్లడించింది. అయితే మార్చి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఉండటంతో ఇంట్లోనే గడుపుతున్న ప్రజలు ఎలాంటి విషయాలు ఎక్కువ సెర్చ్ చేశారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఒకవైపు కరోనా భయం, మరోవైపు క్వారంటైన్… తమకు కావాల్సినవి ఇంటర్నెట్లో ఉన్నాయో లేవోనని ఎంతోమంది సెర్చింగులు మొదలుపెట్టారు.

హెల్త్‌కేర్ విభాగంలో ఎమర్జెన్సీ హెల్త్ కేర్ బెనిఫిట్, సీడీసీ హెల్త్‌కేర్ వర్కర్ల గైడ్‌లైన్స్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఇక కరోనా వైరస్ గురించి వెతికిన ప్రశ్నల్లో కరోనా ఇంకెంత కాలం ఉంటుంది?, ఇప్పటివరకు కరోనాకు ఎన్ని కేసులు?, కరోనా వైరస్ టెస్ట్ ఎక్కడ చేయించుకోవాలి?, ఉపరితలాల మీద కరోనా వైరస్ ఎంతకాలం బతికి ఉంటుంది? అనే ప్రశ్నలు టాప్‌లో నిలిచాయి.

ఇక హౌ టు… ప్రశ్నల్లో గుడ్డతో మాస్క్ ఎలా చేయాలి?, హ్యాండ్ శానిటైజర్ ఎలా చేయాలి? టాయ్‌లెట్ పేపర్ ఎలా చేయాలి? అనే ప్రశ్నలు టాప్‌లో నిలిచాయి. కరోనా వైరస్ గురించి ఎక్కువగా వెతికిన దేశాల్లో ఇటలీ మొదటిస్థానంలో ఉండగా, స్పెయిన్, ఐర్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా గురించి వెతికిన నగరాల్లో మొదటి రెండు స్థానాల్లో మిలన్, రోమ్ ఉండగా… ముంబై, బెంగళూరు.. ఆరు, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.

ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల ట్రెండ్స్‌ని కూడా గూగుల్ ప్రకటించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా హిందీ సినిమా బాగీ 3 అవడం విశేషం. తర్వాతి స్థానాల్లో కాంటేజియన్, అవుట్‌బ్రేక్, బాగీ, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నిలిచాయి. ఇక టీవీ షో కేటగిరీల్లో రామాయణ్ మొదటిస్థానంలో ఉండగా, 2గెదర్, ఒజార్క్, లయర్, చెర్నోబిల్, ఎఫ్‌బీఐ, డార్క్‌‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

tags: Quarantine, Google trends, Lockdown, Coronavirus, Covid 19, baaghi 3

Tags:    

Similar News