గూగుల్‌లో కరోనా టెస్టింగ్ సెంటర్ల సమాచారం

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతీరోజు తొమ్మిది వేల నుంచి పదివేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు రాజకీయ నేతలకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు.. చివరకు డాక్టర్లకు కూడా కరోనా సోకుతుండటంతో వైరస్‌ నిర్ధారణ పరీక్షలను అంతటా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్న సంగతే కానీ.. అవి ఎక్కడున్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అందుకోసం గూగుల్‌ ఓ సరికొత్త […]

Update: 2020-06-12 05:59 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతీరోజు తొమ్మిది వేల నుంచి పదివేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు రాజకీయ నేతలకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు.. చివరకు డాక్టర్లకు కూడా కరోనా సోకుతుండటంతో వైరస్‌ నిర్ధారణ పరీక్షలను అంతటా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్న సంగతే కానీ.. అవి ఎక్కడున్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అందుకోసం గూగుల్‌ ఓ సరికొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) ఆమోదించిన కొవిడ్ -19 సెంటర్లను గుర్తించడంతో పాటు వాటి వివరాలను తెలియజేసేందుకు గూగుల్‌ సెర్చ్‌, గూగుల్ అసిస్టెంట్‌, గూగుల్ మ్యాప్‌లు సహాయపడతాయని గూగుల్‌ ప్రకటించింది. సెర్చ్‌లో ‘కొవిడ్‌ టెస్టింగ్‌’ లేదా ‘కరోనా వైరస్‌ టెస్టింగ్‌’ పేరుతో సెర్చ్ చేస్తే చాలు.. మనకు దగ్గరలోని టెస్టింగ్‌ సెంటర్ల సమాచారం వస్తుంది. దాంతో పాటు ఆస్పత్రికి వెళ్లేలోపు ఆ వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గైడెన్స్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ టూల్ ద్వారా దేశంలోని దాదాపు 300 సిటీల్లో ఉన్న 700 కరోనా టెస్టింగ్‌ సెంటర్ల పూర్తి సమాచారం అందిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. దీనికోసం ICMRతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇంగ్లిష్‌తో పాటు మరో ఎనిమిది భాషల్లో ఈ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండనుంది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, బెంగాళీ , గుజరాతీ, మరాఠి మొదలైన భాషలు ఆ జాబితాలో ఉన్నాయి.

Tags:    

Similar News