ప్లే స్టోర్ నుంచి ‘చైనా రిమూవ్ యాప్స్’ అవుట్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పుట్టుకకు చైనాయే కారణమంటూ చాలా దేశాలు విమర్శిస్తున్నాయి. చాలామంది భారతీయులు సైతం చైనాపై మండిపడుతున్నారు. భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదం కారణంగా చైనాపై మరింత నెగెటివిటీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా యాప్‌ల వాడకాన్ని తగ్గించాలని, వాటిని డిలీట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చైనాకు చెందిన యాప్‌లను గుర్తించి, తొలగించేందుకు ‘రిమూవ్ చైనా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పుట్టుకకు చైనాయే కారణమంటూ చాలా దేశాలు విమర్శిస్తున్నాయి. చాలామంది భారతీయులు సైతం చైనాపై మండిపడుతున్నారు. భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదం కారణంగా చైనాపై మరింత నెగెటివిటీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా యాప్‌ల వాడకాన్ని తగ్గించాలని, వాటిని డిలీట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చైనాకు చెందిన యాప్‌లను గుర్తించి, తొలగించేందుకు ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరుతో ప్లేస్టోర్‌లో లాంచ్ అయిన ఓ యాప్ ఇటీవల బాగా పాపులర్ అయ్యింది. మే 17న ఈ యాప్ ప్లేస్టోర్ లోకి రాగా, కేవలం రెండు వారాల్లోనే టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. అయితే ట్రెండింగ్‌లో ఉన్న ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
గూగుల్ ప్లే స్టోర్‌కు సంబంధించిన పాలసీలను ‘రిమూవ్ చైనా యాప్’ పాటించనందువల్లే గూగుల్ దీన్ని రిమూవ్ చేసింది. యాప్‌కు సంబంధం లేని ఫీచర్లను, సెట్టింగ్స్‌ను యూజర్ పర్మిషన్ లేకుండా మార్చకూడదు. థర్డ్ పార్టీ యాప్స్‌ను డిలీట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం కూడా పాలసీకి విరుద్ధమే. ఇటువంటి కారణాలతో గూగుల్ ఈ యాప్‌ను తొలగించింది. యాప్ నిర్వాహకులు దీన్ని ‘ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్’ పర్పస్‌లో తీసుకొచ్చినట్లు చెప్పారు. కానీ ఒకరి ఫోన్లో ఉన్న చైనా యాప్‌లను గుర్తించి, వాటిని డిలీట్ చేసేలా ఈ యాప్ ప్రోత్సహిస్తోంది. జైపూర్‌లోని స్టార్టప్ కంపెనీ ‘వన్ టచ్ యాప్ ల్యాబ్స్..’ ఈ రిమూవ్ చైనా యాప్‌ను తయారుచేసింది. అయితే గూగుల్ ఇటీవలే.. టిక్ టాక్‌కు పోటీగా రూపొందించిన ‘మిత్రోన్’ అనే యాప్‌ను కూడా తొలగించడం గమనార్హం.