గుడ్ బై చెబుతున్న మరో గూగుల్ ప్రొడక్ట్

ఎక్కువగా వాడకంలో లేని ఉత్పత్తులకు గుడ్ బై చెప్పడం గూగుల్‌కు అలవాటే. కానీ ఎంతో ప్రజాదరణ పొందిన ఒక గూగుల్ ఉత్పత్తికి ఈ సెప్టెంబర్‌లో గుడ్‌బై చెప్పబోతోంది. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లోనూ తప్పనిసరిగా ఉండే గూగుల్ ప్లే మ్యూజిక్ రానున్న అక్టోబర్‌లో పూర్తిగా అందుబాటులో లేకుండా పోనుంది. అయితే దీన్ని ఎవరూ వాడకపోవడం వల్ల తీసేస్తున్నారనుకోవడం పొరపాటే. దీన్ని వాడుతున్నారు కానీ యూట్యూబ్ మ్యూజిక్ పేరుతో కొత్త మ్యూజిక్ యాప్‌ను గూగుల్ లాంచ్ చేసిన కారణంగా దీన్ని […]

Update: 2020-08-05 04:43 GMT

ఎక్కువగా వాడకంలో లేని ఉత్పత్తులకు గుడ్ బై చెప్పడం గూగుల్‌కు అలవాటే. కానీ ఎంతో ప్రజాదరణ పొందిన ఒక గూగుల్ ఉత్పత్తికి ఈ సెప్టెంబర్‌లో గుడ్‌బై చెప్పబోతోంది. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లోనూ తప్పనిసరిగా ఉండే గూగుల్ ప్లే మ్యూజిక్ రానున్న అక్టోబర్‌లో పూర్తిగా అందుబాటులో లేకుండా పోనుంది. అయితే దీన్ని ఎవరూ వాడకపోవడం వల్ల తీసేస్తున్నారనుకోవడం పొరపాటే. దీన్ని వాడుతున్నారు కానీ యూట్యూబ్ మ్యూజిక్ పేరుతో కొత్త మ్యూజిక్ యాప్‌ను గూగుల్ లాంచ్ చేసిన కారణంగా దీన్ని తొలగించబోతున్నారు. ఒకే పని చేసే రెండు యాప్‌లు ఎందుకని ఆ కంపెనీ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మే నెల నుంచి గూగుల్ ప్లే మ్యూజిక్ డేటా మొత్తాన్ని యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పించిన సంగతి తెలిసిందే. గూగుల్ ప్లే మ్యూజిక్ పూర్తిగా తీసేసిన తర్వాత కూడా రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడీ ద్వారా ఈ ట్రాన్స్‌ఫర్ టూల్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అయితే, ఈ గూగుల్ ప్లే మ్యూజిక్ ఎత్తివేతను దశల వారీగా అమలు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ యాప్ పనిచేయకుండా చేస్తారు. తర్వాత అక్టోబర్ నెలాఖరుకు ప్రపంచవ్యాప్తంగా పనిచేయకుండా చేసి గూగుల్ ప్లే మ్యూజిక్‌ను యూట్యూబ్ మ్యూజిక్‌గా రూపాంతరం చేయనున్నారు. అలాగని ఇప్పటికే గూగుల్ ప్లే మ్యూజిక్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్న వినియోగదారుల డేటాకు సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, డబ్బు పెట్టి కొన్న సబ్‌స్క్రిప్షన్లు, పాటల ఎంపికలు, ఆర్టిస్టుల అభిరుచులు ఇతర డేటా మొత్తం యూట్యూబ్ మ్యూజిక్‌కు ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందని గూగుల్ హామీ ఇచ్చింది. ఈ విషయం గురించి అక్టోబర్‌లో అని ప్రకటించిందే తప్ప.. ఎలాంటి తేదీలు వెల్లడించలేదు. కాబట్టి అక్టోబర్ లోపు మీ డేటాను బ్యాకప్ చేసుకోవడమో లేదంటే ట్రాన్స్‌ఫర్ టూల్ ద్వారా యూట్యూబ్ మ్యూజిక్‌కు బదిలీ చేసుకోవడమో చేసుకుంటే మంచిది.

Tags:    

Similar News