గూగుల్ మీట్‌లో ఫ్రీ వీడియో కాల్స్.. సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలం నుంచి ‘వీడియో కాన్ఫరెన్సింగ్’ యాప్‌ల వినియోగం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ‘గూగుల్ మీట్, స్కైప్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్’ వంటి యాప్స్‌కు ఆదరణ పెరగగా, ఈజీగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య పోటీ పెరగడంతో.. సదరు యాప్స్ నిర్వాహకులు తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్స్‌తో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఉచిత అపరిమిత వీడియో కాల్స్ సౌకర్యం, లెన్సులు, ఫిల్టర్లు వంటి […]
దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలం నుంచి ‘వీడియో కాన్ఫరెన్సింగ్’ యాప్‌ల వినియోగం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ‘గూగుల్ మీట్, స్కైప్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్’ వంటి యాప్స్‌కు ఆదరణ పెరగగా, ఈజీగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య పోటీ పెరగడంతో.. సదరు యాప్స్ నిర్వాహకులు తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్స్‌తో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఉచిత అపరిమిత వీడియో కాల్స్ సౌకర్యం, లెన్సులు, ఫిల్టర్లు వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను జోడిస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ‘గూగుల్ మీట్’ పేరుతో ఆన్‌లైన్ వీడియో కాల్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా మొదట ఈ సేవలను ఉచితంగా ప్రవేశపెట్టినప్పటికీ.. 2021 మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా అందిస్తామని, ఆ తర్వాత ఛార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. తాజాగా ఈ గడువు ముగిసిన నేపథ్యంలో ఉచిత సేవలను గూగుల్ మరోసారి పొడిగించడం విశేషం.
గూగుల్ మీట్ తన ఉచిత అన్‌లిమిటెడ్ వీడియో కాల్‌ల సేవలను(24 గంటల పాటు) జూన్ 2021 వరకు పొడిగించింది. అయితే గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్స్ చేసే జీ-మెయిల్ వినియోగదారులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఈ విషయాన్ని గూగుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గతేడాది గూగుల్ హ్యాంగ్ అవుట్‌ను గూగుల్ మీట్‌గా రీ బ్రాండ్ చేయగా, మొదట్లో కేవలం 60 నిమిషాల వరకు మాత్రమే వీడియోకాల్స్ చేసుకునే అవకాశం ఉండేది. కాని కొవిడ్ తర్వాత 24 x7 వీడియోకాల్స్ చేసుకునే వీలు కల్పించడంతో పాటు 100 మందిని మీటింగ్‌లో యాడ్ చేసే ఆప్షన్‌ను కూడా అభివృద్ధి చేసింది. కాగా ఇంతకు మించి సబ్‌స్క్రైబర్స్‌ను మీటింగ్స్‌కు యాడ్ చేయాలంటే గూగుల్ వర్క్ స్పేస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్లు గూగుల్ మీట్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు. వాళ్లు తగినంత స్పీడ్‌తో స్థిరమైన నెట్‌వర్క్ కనెక్షన్‌ను కలిగి ఉంటే వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయవచ్చు.