చూసిన సినిమా వివరాలు ఇక గూగుల్ మ్యాప్స్‌లో!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌లో యూజర్ ఎక్కడికి వెళ్లారు, ఎంతసేపు వెళ్లాడు, ఎన్నిసార్లు వెళ్లాడు అనే వివరాలు మాత్రమే ఉండేవి. ఇక నుంచి వినియోగదారుడు ఏ సినిమా చూశాడు అనే వివరాలను కూడా చూపించబోతోంది. ఈ వివరాలు గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్‌లో కనిపించనున్నాయి. ఆండ్రాయిడ్ పోలీస్ వెబ్సైట్ ప్రచురించిన వివరాల ప్రకారం… యూజర్ వెళ్లిన థియేటర్, అక్కడ గడిపిన సమయం, ఆ సమయంలో సంబంధిత థియేటర్లో ప్లే అవుతున్న సినిమా టైమింగ్స్ ఆధారంగా యూజర్ ఏ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌లో యూజర్ ఎక్కడికి వెళ్లారు, ఎంతసేపు వెళ్లాడు, ఎన్నిసార్లు వెళ్లాడు అనే వివరాలు మాత్రమే ఉండేవి. ఇక నుంచి వినియోగదారుడు ఏ సినిమా చూశాడు అనే వివరాలను కూడా చూపించబోతోంది. ఈ వివరాలు గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్‌లో కనిపించనున్నాయి. ఆండ్రాయిడ్ పోలీస్ వెబ్సైట్ ప్రచురించిన వివరాల ప్రకారం… యూజర్ వెళ్లిన థియేటర్, అక్కడ గడిపిన సమయం, ఆ సమయంలో సంబంధిత థియేటర్లో ప్లే అవుతున్న సినిమా టైమింగ్స్ ఆధారంగా యూజర్ ఏ సినిమా చూశాడో గూగుల్ తెలుసుకోగలుగుతుంది.
అయితే వ్యక్తిగత టైమ్‌లైన్‌లో మాత్రమే కనిపించే ఈ వివరాలు యూజర్ మాత్రమే చూడగలుగుతాడు. కావాలనుకుంటే దీన్ని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ఫిబ్రవరి నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా కారణంగా వ్యక్తుల లొకేషన్ ట్రేస్ చేస్తున్న పనిలో భాగంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యానికి వస్తోందని ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపింది.
Tags: Google, Google maps, Movies, transit, commute