డైరెక్షన్ చెబుతున్న అమితాబ్
దిశ, వెబ్‌డెస్క్: సంతోష్.. ఓ ఫోక్ సింగర్. అతను హిమాయత్ నగర్ నుంచి గచ్చిబౌలి వెళ్లాలనుకున్నాడు. తన జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీసి.. డెస్టినేషన్ సెట్ చేసుకుని నావిగేషన్ ఫీచర్ ఆన్ చేశాడు. ఎందుకంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఎలా వెళ్లాలో అతనికి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే కేవలం బిగ్ బీ వాయిస్ వినేందుకే సంతోష్ నావిగేషన్ స్టార్ట్ చేశాడు. అయితే ఇదంతా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.. కానీ మరికొన్ని రోజుల్లో బిగ్ బీ […]
దిశ, వెబ్‌డెస్క్:
సంతోష్.. ఓ ఫోక్ సింగర్. అతను హిమాయత్ నగర్ నుంచి గచ్చిబౌలి వెళ్లాలనుకున్నాడు. తన జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీసి.. డెస్టినేషన్ సెట్ చేసుకుని నావిగేషన్ ఫీచర్ ఆన్ చేశాడు. ఎందుకంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఎలా వెళ్లాలో అతనికి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే కేవలం బిగ్ బీ వాయిస్ వినేందుకే సంతోష్ నావిగేషన్ స్టార్ట్ చేశాడు. అయితే ఇదంతా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.. కానీ మరికొన్ని రోజుల్లో బిగ్ బీ వాయిస్ గూగుల్ నావిగేషన్‌లో వినిపించవచ్చు. గూగూల్ మ్యాప్స్ ఇండియన్ టీమ్.. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇటీవలే బిగ్ బీని కూడా కలిసినట్లు తెలుస్తోంది. ‘అమితాబ్ ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి. ఎంతో మందిని ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు. గూగుల్ మ్యాప్స్ వాయిస్‌కు తను బెస్ట్ చాయిస్. మేము అమితాబ్ సార్‌ను ఇటీవలే కలిశాం. దీని గురించి చర్చించాం. కానీ కాంట్రాక్ట్ ఫైనలైజ్ కాలేదు’ అని ఓ వ్యక్తి మిడ్ డే న్యూస్‌కు చెప్పినట్లు సమాచారం. కెరీర్ మొదట్లో ఓ ఎఫ్‌ఎం చానెల్.. అమితాబ్ గొంతు బాగాలేదని అతన్ని బయటకు పంపించింది. కానీ ఇప్పుడు అదే గొంతు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం.