భారతీయ కవి జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్..
దిశ, ఫీచర్స్: హిందీ సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన కవితలను అందించిన భారతీయ కవి సుభద్ర కుమారి చౌహాన్.. 117వ జయంతి సందర్భంగా గూగుల్ సోమవారం డూడుల్‌తో నివాళి అర్పించింది. సుభద్ర ఓ కవిత రాస్తున్న చిత్రంతో ఉన్న డూడుల్‌లో.. బ్యాక్‌గ్రౌండ్‌లో గుర్రాన్ని స్వారీ చేస్తున్న రాణి లక్ష్మీ భాయి తో పాటు దేశ స్వాతంత్ర్య పోరాటంలో కొంతమంది వ్యక్తులు కవాతు చేయడం కూడా కనిపిస్తుంది. సుభద్ర కుమారి హిందీ కవిత్వంలో అనేక రచనలను అందించగా ‘ఝాన్సీ కి […]
దిశ, ఫీచర్స్: హిందీ సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన కవితలను అందించిన భారతీయ కవి సుభద్ర కుమారి చౌహాన్.. 117వ జయంతి సందర్భంగా గూగుల్ సోమవారం డూడుల్‌తో నివాళి అర్పించింది. సుభద్ర ఓ కవిత రాస్తున్న చిత్రంతో ఉన్న డూడుల్‌లో.. బ్యాక్‌గ్రౌండ్‌లో గుర్రాన్ని స్వారీ చేస్తున్న రాణి లక్ష్మీ భాయి తో పాటు దేశ స్వాతంత్ర్య పోరాటంలో కొంతమంది వ్యక్తులు కవాతు చేయడం కూడా కనిపిస్తుంది.
సుభద్ర కుమారి హిందీ కవిత్వంలో అనేక రచనలను అందించగా ‘ఝాన్సీ కి రాణి’ ఆమె ప్రసిద్ధ కంపోజిషన్‌లో ఒకటి. రాణి లక్ష్మీ భాయి జీవితాన్ని వివరించే ఈ పద్యం హిందీ సాహిత్యంలో ఎక్కువమంది చదివి, పాడిన పద్యాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. అలాగే భారతీయ తరగతి గదుల్లో చారిత్రక పురోగతికి చిహ్నంగా నిలిచిన ఆమె కవిత్వం ప్రోస్(గద్యం) ప్రధానంగా భారతీయ మహిళలు ఎదుర్కొన్న లింగ, కుల వివక్షను ప్రశ్నిస్తూ.. భవిష్యత్తు తరాలు సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి ప్రోత్సహిస్తుంది.
సుభద్ర కుమారి ఆగష్టు 16, 1904న ఉత్తరప్రదేశ్ నిహల్‌పూర్ గ్రామంలోని రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ప్రయాగరాజ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించి 1919లో మిడిల్-స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలాగే సత్యాగ్రహోద్యమ సమయంలో నాగ్‌పూర్‌లో అరెస్ట్ చేసిన మొదటి మహిళ కాగా 1923, 1942 లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు. ఇక శాసనసభ సభ్యురాలు(పూర్వ సెంట్రల్ ప్రావిన్సులు)గా సేవలందించిన సుభద్ర.. 1948లో నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశానికి హాజరై జబల్‌పూర్‌కు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించారు.