ఇంట్లో ఉండండి .. క్రికెట్ ఆడండి: గూగుల్ డూడుల్
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా.. పిల్లలందరికీ వేసవి సెలవులు ముందుగానే వచ్చాయి. హాలీడేస్ అయితే వచ్చాయి గానీ, ఆడుకోవడానికి బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దాదాపు అందరూ ఇంటిపట్టునే ఉండి ఇండోర్ గేమ్స్, మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. గూగుల్ కూడా ‘ఇంట్లో ఉండండి.. క్రికెట్ ఆడండి’ అంటూ ఓ డూడుల్‌ని హోమ్ పేజీలో డిస్ ప్లే చేసింది. ఆ డూడుల్‌ని క్లిక్ చేస్తే చాలు మనం క్రికెట్ ఆడోచ్చు. కరోనా వైరస్ ప్రబలిన నాటి […]
దిశ, వెబ్ డెస్క్:
కరోనా కారణంగా.. పిల్లలందరికీ వేసవి సెలవులు ముందుగానే వచ్చాయి. హాలీడేస్ అయితే వచ్చాయి గానీ, ఆడుకోవడానికి బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దాదాపు అందరూ ఇంటిపట్టునే ఉండి ఇండోర్ గేమ్స్, మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. గూగుల్ కూడా ‘ఇంట్లో ఉండండి.. క్రికెట్ ఆడండి’ అంటూ ఓ డూడుల్‌ని హోమ్ పేజీలో డిస్ ప్లే చేసింది. ఆ డూడుల్‌ని క్లిక్ చేస్తే చాలు మనం క్రికెట్ ఆడోచ్చు.
కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి..
గూగుల్ సంస్థ, తమ సెర్చింజన్ హోమ్ పేజిలో భిన్నమైన డూడుల్స్ ను రూపొందించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అవగాహన కల్పిస్తోంది. కరోనా పోరులో ముందుండి తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన ప్రాణాలను రక్షిస్తున్న ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ అందరికీ కూడా డూడుల్స్ రూపొందించి కృతజ్ఞతలు తెలిపింది. మొట్టమొదట ‘ఇంట్లోనే ఉండండి, ప్రాణాలు రక్షించుకోండి’ అనే సందేశమిస్తూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన డూడుల్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. డూడుల్‌లో ఉన్న అక్షరాలను గమనిస్తే.. మనం ఇంట్లోనే ఉంటూ ఏమేం చేయొచ్చు… ఎలా కాలక్షేపం చేయొచ్చు ఆ డూడుల్ చెప్పకనే చెప్పింది. అందులో.. ఇంట్లోనే ఉండి పుస్తకాలు చదువుకోవడం, సంగీత వాయిద్యాలను వాయించడం, ఆడుకోవడం, జిమ్ వర్కౌట్స్ చేయడం, ఆత్మీయులతో ఫోన్లు మాట్లాడటం.. వంటి పనులు ఉన్నాయి. ఆ తర్వాత రెండు వారాల పాటు వివిధ రంగాల వారికి థ్యాంక్స్ చెప్తూ ప్రత్యేక డూడుల్స్‌ను ప్రెజెంట్ చేసింది. ఆ తర్వాత కరోనాతో రాడుతున్న అన్ని రంగాలను రిప్రెజెంట్ చేస్తూ ఒకే డూడుల్ కూడా డిజైన్ చేసింది.
ఇక ప్రస్తుతం మరో గేమింగ్ డూడుల్ సిరీస్ తో మనముందుకు వచ్చింది గూగుల్. అందులో మొదటగా ‘ఇంట్లో ఉండండి.. క్రికెట్ ఆడండి’ అనే అంశంతో ఈ గూగుల్ రూపొందించారు. ఈ క్రికెట్ డూడుల్ 2017లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నాటిది. మరోసారి దాన్ని గూగుల్ డూడుల్ గా తీసుకువచ్చింది. అందులో మొదటి జీ అక్షరం చెఫ్ లాంటి క్యాప్ పెట్టుకుని, బ్యాట్ కు బదులుగా అట్లకాడ చేతిలో పట్టుకుని ఉంటుంది. ఈ అనే అక్షరం సాక్స్ ని బాల్ గా చేసి.. విసరగానే ‘జీ’ దాన్ని అద్భుతమైన షాట్ తో సిక్సర్ గా మలుస్తుంది. అయితే ఈ డూడుల్ పై క్లిక్ చేస్తే.. మనం క్రికెట్ ఆడోచ్చు. ఫోర్లు, సిక్స్ లు, రన్స్ చేస్తూ మజా చేయొచ్చు.
Tags: coronavirus, lockdown, google, doodle, interactive games, google doodle games