డార్క్ మోడ్‌లో గూగుల్ సెర్చ్

స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగమైన తర్వాత.. దాని స్క్రీన్ వెలుగు కళ్ల మీద ప్రభావం చూపించకుండా ఉండేందుకు డార్క్ మోడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, వాట్సాప్‌లు డార్క్ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ సెర్చ్ యాప్ కూడా డార్క్ మోడ్ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. మంగళవారం అధికారికంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత మొబైల్ ఫోన్లలో ఈ గూగుల్ సెర్చ్ డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ మోడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి […]

Update: 2020-05-19 07:22 GMT

స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగమైన తర్వాత.. దాని స్క్రీన్ వెలుగు కళ్ల మీద ప్రభావం చూపించకుండా ఉండేందుకు డార్క్ మోడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, వాట్సాప్‌లు డార్క్ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ సెర్చ్ యాప్ కూడా డార్క్ మోడ్ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. మంగళవారం అధికారికంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత మొబైల్ ఫోన్లలో ఈ గూగుల్ సెర్చ్ డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చింది.

ఈ మోడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక, డీఫాల్ట్ సెట్టింగ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. అంటే ఫోన్ ప్రారంభించగానే సెర్చ్ యాప్ డార్క్ మోడ్‌లోనే ఉండనుంది. దీన్ని మార్చాలంటే మళ్లీ సెట్టింగులోకి వెళ్లి మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 లేదా ఐఓఎస్ 12 అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి గూగుల్ ఒక్కొక్క అప్‌డేట్‌ని విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే క్రోమ్‌లో ట్యాబ్ గ్రూపింగ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News