బ్యాటరీ డ్రైయినింగ్ యాడ్స్‌కు గూగుల్ గుడ్‌బై !
దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ క్రోమ్‌లో మనం ఏదైనా వస్తువు గురించిగానీ, టాపిక్ గురించిగానీ సెర్చ్ చేస్తుంటే.. ఆ సమయంలో దానికి సంబంధించిన యాడ్స్ డిస్‌ప్లే అవుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గూగుల్ ‘రిసోర్స్ హెవీ యాడ్స్’ను తొలిగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు చివరికల్లా గూగుల్ ఈ అప్‌డేట్‌ను తీసుకురానుంది. యాడ్ డ్యురేషన్ ఎక్కువగా ఉంటే యూజర్ ఆ యాడ్‌తో కనెక్ట్ కాలేకపోతాడు. దాంతో యూజర్ ఆ యాడ్‌ను ట్యాప్ లేదా క్లిక్ చేయకుండా ఎస్కేప్ […]
దిశ, వెబ్‌డెస్క్:
గూగుల్ క్రోమ్‌లో మనం ఏదైనా వస్తువు గురించిగానీ, టాపిక్ గురించిగానీ సెర్చ్ చేస్తుంటే.. ఆ సమయంలో దానికి సంబంధించిన యాడ్స్ డిస్‌ప్లే అవుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గూగుల్ ‘రిసోర్స్ హెవీ యాడ్స్’ను తొలిగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు చివరికల్లా గూగుల్ ఈ అప్‌డేట్‌ను తీసుకురానుంది. యాడ్ డ్యురేషన్ ఎక్కువగా ఉంటే యూజర్ ఆ యాడ్‌తో కనెక్ట్ కాలేకపోతాడు. దాంతో యూజర్ ఆ యాడ్‌ను ట్యాప్ లేదా క్లిక్ చేయకుండా ఎస్కేప్ అవుతాడు. ఈ యాడ్స్ వల్ల యూజర్‌కు ఎలాంటి ఉపయోగం ఉండకపోగా, బ్యాటరీ ఖర్చవడంతోపాటు డేటా అయిపోతుందని గూగుల్ తెలిపింది. అందువల్ల గూగుల్ క్రోమ్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌పై కొన్ని పరిమితులను విధించింది.
– నెట్‌వర్క్ బ్యాండ్ విడ్త్ 4 ఎంబీకి మించరాదు
– సీపీయూ పవర్ యూసేజ్ 60 సెకన్లకు పెరగకూడదు
ఈ నిబంధనలను పాటించని యాడ్స్ ఆటోమేటిక్‌గా గూగుల్ క్రోమ్ నుంచి రిమూవ్ అయిపోతాయి. 2019 జూలై నుంచి గూగుల్ ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తోంది. కాగా ఆగస్టు వరకు దీన్ని లాంచ్ చేయనుంది.