29 యాప్స్ తొలగించిన గూగుల్

దిశ, వెబ్ డెస్క్: గూగుల్ ఎప్పటికప్పుడు తన ప్లే స్టోర్‌లోని మాలిషియస్, మాల్‌వేర్ యాప్‌లను తొలగిస్తూ ఉంటుంది. తాజాగా ప్లేస్టోర్ నుంచి గూగుల్‌ సంస్థ 29 యాప్‌లను తొలగించింది. యాడ్‌వేర్(ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్)‌తో నిండిన ఈ యాప్‌లలో వినియోగం లేని యాడ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్‌ గుర్తించింది. ఇప్పటికే యూజర్లు ఎంతోమంది వీటిని డౌన్‌లోడ్ చేశారని, వీటి డౌన్‌లోడ్‌ల సంఖ్య 3.5 మిలియన్ ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది. సతోరి థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ ‘చార్టర్ […]

Update: 2020-07-29 06:08 GMT

దిశ, వెబ్ డెస్క్: గూగుల్ ఎప్పటికప్పుడు తన ప్లే స్టోర్‌లోని మాలిషియస్, మాల్‌వేర్ యాప్‌లను తొలగిస్తూ ఉంటుంది. తాజాగా ప్లేస్టోర్ నుంచి గూగుల్‌ సంస్థ 29 యాప్‌లను తొలగించింది. యాడ్‌వేర్(ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్)‌తో నిండిన ఈ యాప్‌లలో వినియోగం లేని యాడ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్‌ గుర్తించింది. ఇప్పటికే యూజర్లు ఎంతోమంది వీటిని డౌన్‌లోడ్ చేశారని, వీటి డౌన్‌లోడ్‌ల సంఖ్య 3.5 మిలియన్ ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది.

సతోరి థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ ‘చార్టర్ యూజ్‌బ్లర్’ పేరుతో చేసిన ఇన్వెస్టిగేషన్‌లో యాడ్‌వేర్ కలిగిన మొత్తం 29 యాప్‌లను గుర్తించింది. వీటిలో అధికంగా ఫొటో ఎడిటింగ్‌ యాప్‌లు ఉన్నట్లు ఈ బృందం గుర్తించింది. ‘బ్లర్‌’, ‘చార్డర్ యూజ్’ అనే కోడ్‌ పేరుతో ఈ యాడ్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ఫోన్‌లలో ప్రవేశింపజేస్తున్నారని తెలుస్తోంది. ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫోన్‌లో లాంచ్ ఐకాన్స్‌ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దాంతో ఇలాంటి మాలిషియస్ యాప్‌ను డిలీట్ చేయడం యూజర్‌కు కష్టమవుతుంది. యూజర్ తన ఫోన్‌లో ఏం సెర్చ్ చేసినా.. వెంటనే కోడ్‌లా జనరేట్ అవుతుంది. వాటికి సంబంధించిన యాడ్స్ పాప్ అప్‌లా ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు ఫోన్‌ అన్‌లాక్ కావడం, యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం, ఫోన్‌ను ఛార్జ్ చేయడం, మొబైల్ డేటా నుంచి వై-ఫైకి మారడం వంటివి ఫోన్‌లో అటోమెటిక్‌గా జరిగిపోతాయి. అలాగే యాడ్ పాప్ అప్స్‌తో మొత్తం స్క్రీన్‌ను ఆక్రమిస్తాయని వెల్లడించింది.

మాలిషియస్ యాడ్‌వేర్ కలిగిన ఈ యాప్‌లను గూగుల్ వెంటనే తొలగించింది. ఇలాంటి యాప్ లను గుర్తించేందుకు..సతోరి టీమ్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది. అవేంటంటే.. ఇలాంటి యాప్స్ 5 స్టార్ రేటింగ్ లేదా 1 స్టార్ రేటింగ్‌లు కలిగి ఉంటాయని, అతి తక్కువ టైమ్‌లోనే ఎక్కువగా డౌన్‌లోడ్‌లు సాధిస్తాయని, డౌన్ లోడ్ చేసిన తర్వాత ఇవి ఫోన్‌లో కనిపించకుండా పోతాయని తెలిపారు.

Tags:    

Similar News