గూగుల్ అసిస్టెంట్‌లో ‘ఫ్యామిలీ’ ఫీచర్స్
దిశ, ఫీచర్స్ : ‘మదర్స్ డే’ సందర్భంగా గూగుల్ అసిస్టెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల కోసం కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్, ఫ్యామిలీ బెల్ ఫీచర్‌తో పాటు న్యూ ఎన్‌హాన్స్‌డ్ బ్రాడ్‌కాస్ట్ మెసేజింగ్ ఫీచర్స్ అందించబోతోంది. ఈ కొత్త ఫీచర్లను గూగుల్ ఇటీవలే తమ బ్లాగ్ పోస్ట్‌లో కూడా ప్రకటించింది. కాగా మదర్స్‌తో పాటు ఫ్యామిలీ మొత్తానికి సాయపడనున్న ఈ ఫీచర్స్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.. న్యూ బ్రాడ్‌కాస్ట్ ఫీచర్ : న్యూ ఎన్‌హాన్స్‌డ్ బ్రాడ్‌కాస్ట్ […]
దిశ, ఫీచర్స్ : ‘మదర్స్ డే’ సందర్భంగా గూగుల్ అసిస్టెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల కోసం కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్, ఫ్యామిలీ బెల్ ఫీచర్‌తో పాటు న్యూ ఎన్‌హాన్స్‌డ్ బ్రాడ్‌కాస్ట్ మెసేజింగ్ ఫీచర్స్ అందించబోతోంది. ఈ కొత్త ఫీచర్లను గూగుల్ ఇటీవలే తమ బ్లాగ్ పోస్ట్‌లో కూడా ప్రకటించింది. కాగా మదర్స్‌తో పాటు ఫ్యామిలీ మొత్తానికి సాయపడనున్న ఈ ఫీచర్స్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
న్యూ బ్రాడ్‌కాస్ట్ ఫీచర్ :
న్యూ ఎన్‌హాన్స్‌డ్ బ్రాడ్‌కాస్ట్ మెసేజింగ్ ఫీచర్ సాయంతో గూగుల్ అసిస్టెంట్.. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల డివైజెస్(స్మార్ట్‌ఫోన్‌లు, గూగుల్ హోమ్, గూగుల్ నెస్ట్) అన్నింటికీ వేగంగా మెసేజ్ చేరవేస్తుంది. కాగా ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు iOS యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫ్యామిలీ బెల్ :
గూగుల్ ‘ఫ్యామిలీ బెల్’ ఫీచర్‌ను ఆగస్టు 2020లోనే ఇంట్రడ్యూస్ చేయగా మరొసారి కొత్త ఆప్షన్స్‌తో సరికొత్తగా ఆవిష్కరించింది. దీని సాయంతో కుటుంబ సభ్యుల్లో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది రిమైండర్‌లతో పాటు అలారం టైమింగ్స్ సెట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫీచర్ త్వరలోనే హిందీ, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్, స్పానిష్ వంటి ఇతర భాషల్లోనూ పని చేయనుంది. అంతేకాదు ఇంట్లోని మల్టీపుల్ డివైజ్‌లకు నోటిఫికేషన్లు కూడా సెండ్ చేస్తుంది.
స్టోరీ నెరేషన్, న్యూ సాంగ్స్ :
గూగుల్ అసిస్టెంట్.. ఇకపై పిల్లల కోసం బెడ్‌టైమ్‌లో కథలు కూడా చెప్పనుంది. వీటిని స్మార్ట్ డిస్‌ప్లే లేదా ఆండ్రాయిడ్ డివైజ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. Google లైబ్రరీలో అందుబాటులో ఉన్న ఏ స్టోరీనైనా మనం కథగా ఎంచుకుంటే, గూగుల్ అసిస్టెంట్ నెరేట్ చేస్తుంది. ఇక పాటర్‌మోర్ పబ్లిషింగ్ పెంగ్విన్ రాండమ్ హౌస్‌తో గూగుల్ భాగస్వామ్యం కలిగి ఉండగా, ‘హ్యారీ పాటర్’, ‘హూ వాస్’ కథలను కూడా వినే అవకాశం ఉంది. గూగుల్ నెస్ట్ హబ్ వంటి డివైజెస్‌లో పిల్లలు ‘ఆర్ యూ స్మార్టర్ దెన్ ఏ ఫిఫ్త్ గ్రేటర్?’ వంటి ఆటలను కూడా ఆడొచ్చు.
ఇంటి పనుల్లో పిల్లలు సాయపడటాన్ని ప్రోత్సహించేందుకు గూగుల్ మూడు కొత్త పాటలను అసిస్టెంట్‌కు తీసుకొస్తోంది. కొవిడ్ -19 మహమ్మారి ప్రారంభంలో కంపెనీ ప్రవేశపెట్టిన హ్యాండ్ వాషింగ్ పాట మాదిరే ఇవి కూడా బాగుంటాయని గూగుల్ పేర్కొంది. కొత్త పాటల్లో ‘క్లీన్ అప్’(clean up), ‘నిద్రపోండి(go to sleep) పాటలతో పాటు వినోదం కోసం ‘మీ పళ్ళు తోముకోండి’ (brush your teeth) ఉన్నాయి.