టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

దిశ వెబ్‌డెస్క్: టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. టెన్త్ పరీక్షల ఫీజు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్చి 12లోగా ఫీజు చెల్లించవచ్చని, ఎటువంటి ఆలస్య రుసుము ఉండదని పేర్కొంది. ఇక రూ.50 లేట్ ఫీజుతో మార్చి 16లోగా చెల్లించవచ్చని, రూ. 200 ఆలస్య రుసుముతో మార్చి 18వ వరకు చెల్లించవచ్చని తెలిపింది. ఇక రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని సెకండరీ బోర్డు తెలిపింది. విద్యార్థులు చెల్లించిన ఎగ్జామ్ […]

Update: 2021-03-05 23:33 GMT

దిశ వెబ్‌డెస్క్: టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. టెన్త్ పరీక్షల ఫీజు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్చి 12లోగా ఫీజు చెల్లించవచ్చని, ఎటువంటి ఆలస్య రుసుము ఉండదని పేర్కొంది. ఇక రూ.50 లేట్ ఫీజుతో మార్చి 16లోగా చెల్లించవచ్చని, రూ. 200 ఆలస్య రుసుముతో మార్చి 18వ వరకు చెల్లించవచ్చని తెలిపింది.

ఇక రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని సెకండరీ బోర్డు తెలిపింది. విద్యార్థులు చెల్లించిన ఎగ్జామ్ ఫీజును హెడ్‌మాస్టర్స్ మార్చి 23లోగా సబ్ ట్రెజరీ ఎస్‌బీఐకి చెల్లించాలని, డీఈఓ కార్యాలయాల్లో నామినల్ రోల్స్‌ని మార్చి 24లోగా సమర్పించాలంది.

కాగా టెన్త్ ఎగ్జామ్స్ మే 17 నుంచి 26వరకు జరగనుండగా.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.

Tags:    

Similar News