Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జీఎన్సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పింది. ఈ కేంద్రాలను శనివారం టీటీడీ జేఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన […]
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జీఎన్సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పింది. ఈ కేంద్రాలను శనివారం టీటీడీ జేఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఈజీగా అద్దె గదులు పొందవచ్చని తెలిపారు. ఆరు కౌంటర్లలో ఎక్కడైన గదులు బుక్ చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండటం, వాహనాల పార్కింగ్ సమస్యలు తలెత్తుతుండటంతో వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్మారెడ్డి. ఆన్లైన్‌లో వసతి గదులు బుక్ చేసుకున్న భక్తులు నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గది కేటాయించిన సమాచారం రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో పంపుతారని జేఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.