లోన్లు చెల్లించినవారికి కేంద్రం గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్ : మార్చి 1 నుంచి ఆగష్టు 31 మధ్యలో రుణాలపై చక్రవడ్డీని విధించకూడదని సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు వెల్లడించింది. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్ సమయంలో ఎవరైతే మారటోరియంను వినియోగించకుండా లోన్లను సకాలంలో చెల్లించారో, వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపు/క్యాష్‌బ్యాక్ ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రూ. 2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న చిరు వ్యాపార సంస్థలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు దాని ఫలాలు అందుతాయని పేర్కొంది. వాణిజ్య, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, […]
దిశ, వెబ్ డెస్క్ : మార్చి 1 నుంచి ఆగష్టు 31 మధ్యలో రుణాలపై చక్రవడ్డీని విధించకూడదని సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు వెల్లడించింది. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్ సమయంలో ఎవరైతే మారటోరియంను వినియోగించకుండా లోన్లను సకాలంలో చెల్లించారో, వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపు/క్యాష్‌బ్యాక్ ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రూ. 2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న చిరు వ్యాపార సంస్థలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు దాని ఫలాలు అందుతాయని పేర్కొంది.
వాణిజ్య, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలతో సహా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రితలో ఉన్న మనీ లెండర్స్ అన్నింటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పలు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆరు నెలల వడ్డీ-చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని మారటోరియం సమయంలో ఈఎంఐలు చెల్లించినవారికి క్యాష్‌బ్యాక్ రూపంలో నవంబర్ 5వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాలిచ్చింది.