ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా కాలంలో ఉద్యోగుల బాధ అంతా ఇంతా కాదు. కొంతమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. మరికొంతమంది తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయోనన్న ఆందోళనలో ఉన్నారు. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ తమ ఉద్యోగులకు శుభవార్త తెలపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీకి గ్లోబర్ క్లస్టర్ నుండి భారీ ఒప్పందాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తాజాగా ఓ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా కాలంలో ఉద్యోగుల బాధ అంతా ఇంతా కాదు. కొంతమంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. మరికొంతమంది తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయోనన్న ఆందోళనలో ఉన్నారు. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ తమ ఉద్యోగులకు శుభవార్త తెలపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీకి గ్లోబర్ క్లస్టర్ నుండి భారీ ఒప్పందాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పుంజుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ నాటికి అర్హత కలిగిన జూనియర్, మధ్యస్థాయి సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వనుందంట. అయితే, ఈ కంపెనీలో మొత్తం 2.4 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. ఇందులో సగానికి పైగా ఉద్యోగుల శాలరీస్ హైక్ కానున్నాయి. అలాగే వారికి ప్రమోషన్లు ఇవ్వనున్నది.