ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వారంరోజుల్లో వడ్డీ జమ!

దిశ, వెబ్‌డెస్క్: ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ ఖాతాలో మరో వారం రోజుల్లో వడ్డీ జమ కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ నెలాఖరులోగా చందాదారుల ఖాతాలో 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని జమ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువగా చందాదారులు విత్ డ్రాలు చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచింది. 2020లో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా మార్చి 2020లో పీఎఫ్ […]

Update: 2021-07-25 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ ఖాతాలో మరో వారం రోజుల్లో వడ్డీ జమ కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ నెలాఖరులోగా చందాదారుల ఖాతాలో 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని జమ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువగా చందాదారులు విత్ డ్రాలు చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచింది. 2020లో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా మార్చి 2020లో పీఎఫ్ వడ్డీ రేటును 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతానికి తగ్గించింది. గత ఏడేండ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు ఇప్పుడే చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ వచ్చే వారం పనిదినాల్లో ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీని 8.5 శాతం క్రెడిట్ చేయవచ్చు. కాబట్టి, ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను మెసేజ్ రూపంలో లేదా మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఇలా చెక్ చేసుకోండి…

బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి “EPFOHO UAN ENG” అని టైపు చేసి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీ పీఎఫ్ ఖాతాకు మీ మొబైల్ నెంబర్ లింకు చేసినట్లయితే, ఎస్ఎమ్ఎస్ పంపిన తర్వాత పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఒక మెసేజ్ వస్తుంది. అలాగే, ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ మిస్డ్ కాల్ ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇచ్చిన కొద్ది సమయం తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. అందులో మీ ఖాతా బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఈ సౌకర్యం కేవైసీ పూర్తి చేసుకున్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది.

Follow Disha official Facebook page: https://www.facebook.com/dishatelugunews

Tags:    

Similar News