బంగారు వ్యాపారుల బంద్ సక్సెస్

దిశ, మంగపేట: బంగారు నగలపై హాల్ మార్క్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ మండలంలోని బంగారు నగల వ్యాపారులు సోమవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో జ్యూయలరీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసుల సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి కాసుల శంకర్ లు మాట్లాడారు. ది వరంగల్ బులియన్ జ్యూవెల్లరీ, డైమండ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండు శ్రీనివాస్ పిలుపు మేరకు మండలంలోని బంగారు నగల వ్యాపారులు బంద్ చేసినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై హెచ్ యూ ఐడీ […]

Update: 2021-08-23 04:45 GMT

దిశ, మంగపేట: బంగారు నగలపై హాల్ మార్క్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ మండలంలోని బంగారు నగల వ్యాపారులు సోమవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో జ్యూయలరీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసుల సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి కాసుల శంకర్ లు మాట్లాడారు. ది వరంగల్ బులియన్ జ్యూవెల్లరీ, డైమండ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండు శ్రీనివాస్ పిలుపు మేరకు మండలంలోని బంగారు నగల వ్యాపారులు బంద్ చేసినట్లు తెలిపారు.

బంగారు ఆభరణాలపై హెచ్ యూ ఐడీ హాల్ మార్కింగ్ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాపారులందరూ నిరసన వ్యక్తం చేసి ఒక్కరోజు బంద్ పాటించినట్లు తెలిపారు. హాల్ మార్క్‌ను స్వాగతిస్తూ హెచ్ యూ ఐ డీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నగల వ్యాపారులు పెందోట సతీష్, దాసుల సురేందర్, కందుకూరి శ్రీనివాస్, దాసుల శ్రీనువాస్, పెందోట సందీప్, ప్రవీణ్, క్రాంతి, సాయిలు పాల్గొన్నారు.

Tags:    

Similar News