బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం
దిశ వెబ్‌డెస్క్: బంగారం ప్రియులకు శుభవార్త.. బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే మీకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే.. బంగారం ధరలు రోజురోజుకి భారీగా తగ్గిపోతున్నాయి. అంతర్ఝాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం ఏర్పడింది. దీంతో బంగారం ధరలు గత కొద్దినెలలుగా తగ్గుతూ వస్తుండగా.. గత వారం రోజులుగా మరింతగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తుున్న బంగారం ధరలు.. శనివారం మరింతగా […]
దిశ వెబ్‌డెస్క్: బంగారం ప్రియులకు శుభవార్త.. బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే మీకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే.. బంగారం ధరలు రోజురోజుకి భారీగా తగ్గిపోతున్నాయి. అంతర్ఝాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం ఏర్పడింది. దీంతో బంగారం ధరలు గత కొద్దినెలలుగా తగ్గుతూ వస్తుండగా.. గత వారం రోజులుగా మరింతగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తుున్న బంగారం ధరలు.. శనివారం మరింతగా తగ్గాయి. శనివారం అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గడంతో 1698 డాలర్లకి చేరుకుంది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.71 తగ్గడంతో.. 25.28 డాలర్లకు క్షీణించింది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 క్షీణించి రూ.45,220కి చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.41,450కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.69,900కి చేరుకుంది.