భారీగా పెరిగిన బంగారం ధరలు
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. ఇటీవల పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు, వాణిజ్య పరిణామాలు, వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలను బట్టి దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. గురువారం ఇండియన్ బులియన్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. […]
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. ఇటీవల పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు, వాణిజ్య పరిణామాలు, వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలను బట్టి దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి.
గురువారం ఇండియన్ బులియన్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 44,750 నుంచి రూ. 44, 970 కి పెరిగింది. అంటే ఒక్కరోజులో ఏకంగా రూ. 780 పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 41,223 నుంచి రూ. 41,938కి పెరిగింది. అంటే, ఒక్కరోజులో రూ. 715 పెరిగింది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 47,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 43,800 ఉంది. వెండి కూడా ఒక్కరోజులో రూ. 710 పెరిగి రూ. 65,410కి చేరుకుంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే..ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్లు పది గ్రాములు రూ. 44,370 ఉండగా, బెంగళూరులో రూ. 46,200, కోల్‌కతాలో రూ. 46,990గా ఉంది.