నాలుగు రోజుల కనిష్ఠానికి గోల్డ్ ధరలు.. వెండి పైపైకే..!
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా క్రమంగా తక్కుతూ వచ్చిన ధరలు మంగళవారం నిన్నటి ధరతో నిలకడగా ఉన్నది. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. సోమవారం స్థిరంగా ఉన్న వెండి ధర నేడు రూ.700లకు ఎగబాకింది. సిల్వర్ ధర నిన్న రూ.73,900 కాగా, ప్రసుత్తం రూ.74,600 ఉన్నది. ఈ ఏడాది వెండి ధర అత్యధికంగా జనవరి 6న రూ.75,100లుగా నమోదు కాగా, జనవరి 12న రూ.65,00లుగా అతి తక్కువ […]
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా క్రమంగా తక్కుతూ వచ్చిన ధరలు మంగళవారం నిన్నటి ధరతో నిలకడగా ఉన్నది. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. సోమవారం స్థిరంగా ఉన్న వెండి ధర నేడు రూ.700లకు ఎగబాకింది. సిల్వర్ ధర నిన్న రూ.73,900 కాగా, ప్రసుత్తం రూ.74,600 ఉన్నది. ఈ ఏడాది వెండి ధర అత్యధికంగా జనవరి 6న రూ.75,100లుగా నమోదు కాగా, జనవరి 12న రూ.65,00లుగా అతి తక్కువ ధర పలికింది.
24 క్యారెట్ల గోల్డ్ ధర మంగళవారం 48,290 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250లుగా నమోదు అయింది. ఇది నిన్నటి ధరలతో సమానం. నాలుగు రోజులుగా ఇవ్వే ధరలు స్థిరంగా కొనసాగడం గమనార్హం. ఫిబ్రవరి 11న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 కాగా, ఫిబ్రవరి 12న రూ.310 తగ్గి.. రూ.48,290లుగా నమోదు అయింది. అదే రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,550 ఉండగా, రూ.300 తగ్గి.. 44,250 లుగా నమోదైంది. ఆ రోజు నుంచి ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జనవరి 5న 24 క్యారెట్ల పసిడి ధర అత్యధికంగా రూ.52,360 కాగా, 22 క్యారెట్ల ధర రూ.48,000లుగా నమోదు అయింది. అతి తక్కువ ధర జనవరి 18న 24 క్యారెట్ల బంగారం ధర 49,620 కాగా, 22 క్యారెట్ల ధర రూ.45,490లుగా నమోదు అయింది.