మిక్స్‌డ్ టగ్ ఆఫ్ వార్‌లో తెలంగాణ జట్టుకు గోల్డ్ మెడల్

దిశ, గద్వాల: మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి మిక్సీడ్ టగ్ ఆఫ్ వార్ అండర్-19 (4 పురుషులు+4 మహిళలు) పోటీల్లో తెలంగాణ జట్టు బంగారు పతకం సాధించింది. ఫైనల్‌లో రాజస్తాన్ జట్టుతో తలపడిన తెలంగాణ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో జోగుళాంబ గద్వాల్ జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కేటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని సునీత జట్టు క్యాప్టెన్ గా వ్యవహరించడంతో… గద్వాల్ మండలం చెనుగొనిపల్లికి చెందిన […]

Update: 2021-11-29 11:50 GMT

దిశ, గద్వాల: మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి మిక్సీడ్ టగ్ ఆఫ్ వార్ అండర్-19 (4 పురుషులు+4 మహిళలు) పోటీల్లో తెలంగాణ జట్టు బంగారు పతకం సాధించింది. ఫైనల్‌లో రాజస్తాన్ జట్టుతో తలపడిన తెలంగాణ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో జోగుళాంబ గద్వాల్ జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కేటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని సునీత జట్టు క్యాప్టెన్ గా వ్యవహరించడంతో… గద్వాల్ మండలం చెనుగొనిపల్లికి చెందిన సుతేందర్ జట్టు సభ్యులుగా ఉండటం విశేషం.

జాతీయ స్థాయి టగ్ ఆప్ వార్‌లో పాల్గొన్న జిల్లా క్రీడాకారులకు జిల్లా టగ్ ఆఫ్ వార్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య(PT) కోచ్‌గా వ్యవహరించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో జిల్లా ప్రజలు, క్రీడాకారులు వారిని అభినందించారు.

Tags:    

Similar News