ఈ ఏడాది కొత్త గరిష్టాలకు బంగారు రుణ వ్యాపారాలు

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆదాయాలు పడిపోవడంతో ప్రజలతో పాటు చాలామంది చిన్న వ్యాపారాల వారు తక్షణ ఇంటి అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరం బంగారు రుణ వ్యాపారం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రకమైన వ్యాపారాలు 15 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతాయని ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘దేశీయంగా అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, […]

Update: 2021-06-06 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆదాయాలు పడిపోవడంతో ప్రజలతో పాటు చాలామంది చిన్న వ్యాపారాల వారు తక్షణ ఇంటి అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరం బంగారు రుణ వ్యాపారం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రకమైన వ్యాపారాలు 15 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతాయని ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘దేశీయంగా అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్, ఆంక్షలు ఉన్నందున చాలామంది బంగారం తాకట్టుకు వెళ్లలేకపోయారు.

ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత వ్యాపారాలు మళ్లీ ప్రారంభించేందుకు నగదు అవసరం, ఆ సమయంలో బంగారు రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. గతేడాది మొదటి వేవ్ సమయంలో ఇదే జరిగిందని’ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ చెప్పారు. గతేడాది ముత్తూట్ ఫైనాన్స్ బంగారు రుణ వ్యాపారాలు 26 శాతం పెరిగాయి. ఈ ఏడాది 15 శాతం వృద్ధి ఉండొచ్చని ఆయన తెలిపారు. ఇతర బంగారు రుణ వ్యాపార సంస్థలు సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాయి. కరోనా పరిస్థితుల నుంచి ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు ఈ రకమైన వ్యాపారాల వారు మరిన్ని శాఖలను పెంచడమే ఈ వృద్ధికి కారణంగా నిలవొచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News