వరుసగా మూడోరోజూ పెరిగిన పసిడి!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు గత వారం బాగా క్షీణించిన బంగారం ధరలు మెల్లగా కోలుకుంటున్నాయి. మళ్లీ పపైకి పోతోంది. బుధవారంతో వరుసగా మూడోరోజు కూడా పెరిగిన పసిడి రూ. 41,000 మార్కును చేరుకుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను బలహీన పరుస్తున్న కరోనా ప్రభావాన్ని అమెరికా సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలు నెమ్మదిగా పైకి వెళ్తున్నాయి. దేశీయ కమోడిటీ మార్కేట్లో రూ. 200 పైగా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు గత వారం బాగా క్షీణించిన బంగారం ధరలు మెల్లగా కోలుకుంటున్నాయి. మళ్లీ పపైకి పోతోంది. బుధవారంతో వరుసగా మూడోరోజు కూడా పెరిగిన పసిడి రూ. 41,000 మార్కును చేరుకుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను బలహీన పరుస్తున్న కరోనా ప్రభావాన్ని అమెరికా సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలు నెమ్మదిగా పైకి వెళ్తున్నాయి. దేశీయ కమోడిటీ మార్కేట్లో రూ. 200 పైగా పెరిగిన బంగారం పది గ్రాములు రూ. 41,458 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిశీలిస్తే ఔన్స్ బంగారం 5 డాలర్లకు పైగా పెరిగి, 1664 డాలర్ల వద్ద ఉంది.
tags : gold price, gold rate, commodity market