ట్రంక్‌ పెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సీ కాలనీకి చేరుకొన్న పోలీసులు దాదాపు రెండు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 ట్రంక్ పెట్టేలను గుర్తించిన పోలీసులు.. ఓ పెట్టేను తెరవగా… అందులో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ముగ్గురు డీఎస్పీలు, తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మొత్తం సొత్తును లెక్కిస్తున్నారు. ట్రెజరీలో పనిచేసే మనోజ్ అనే వ్యక్తికి సంబంధించిన వస్తువులని పోలీసులు ప్రాథమిక […]

Update: 2020-08-18 10:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సీ కాలనీకి చేరుకొన్న పోలీసులు దాదాపు రెండు గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 ట్రంక్ పెట్టేలను గుర్తించిన పోలీసులు.. ఓ పెట్టేను తెరవగా… అందులో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ముగ్గురు డీఎస్పీలు, తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మొత్తం సొత్తును లెక్కిస్తున్నారు. ట్రెజరీలో పనిచేసే మనోజ్ అనే వ్యక్తికి సంబంధించిన వస్తువులని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఎస్సీ కాలనీలో మొత్తం పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. ఆ ప్రాంతానికి కొత్త వ్యక్తులను రానివ్వకుండా, అక్కడివారిని బయటకు పంపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News