అందనంత దూరంలో పసిడి, వెండి ధరలు

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కరోనా సంక్షోభం వలన బంగారం సామాన్య ప్రజలకు అందకుండా పరుగులు పెడుతోంది. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం మునుపెన్నడూ లేనంత స్థాయిలో పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్ల) ధర రూ.58,330 చేరింది. కిలో వెండి ధర రూ. 78,300 చేరుకుంది. రెండ్రోజుల వ్యవధిలో బంగారం ధర రూ. వెయ్యి పెరగడం గమనార్హం. వారం వ్యవధిలో […]

Update: 2020-08-07 07:11 GMT

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కరోనా సంక్షోభం వలన బంగారం సామాన్య ప్రజలకు అందకుండా పరుగులు పెడుతోంది. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం మునుపెన్నడూ లేనంత స్థాయిలో పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్ల) ధర రూ.58,330 చేరింది. కిలో వెండి ధర రూ. 78,300 చేరుకుంది.

రెండ్రోజుల వ్యవధిలో బంగారం ధర రూ. వెయ్యి పెరగడం గమనార్హం. వారం వ్యవధిలో బంగారం ధర ఇప్పటికే మూడు సార్లు పెరిగింది. రోజుకు రూ.800 నుంచి 1000 మధ్య పెరుగుతోంది. బంగారం ధర గరిష్ట స్థాయిలో రూ.65,000 వరకూ పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు కారణమైందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలన్నాయి.

Tags:    

Similar News