పోటీపడి తగ్గిన బంగారం, వెండి ధరలు

దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరల పరుగులకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నా.. దేశీంయంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440, 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గింది. వెండి ధర ఏకంగా రూ.1500 పతనమై.. కిలో రూ.70,500లకు పడిపోయింది. మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 కాగా, […]

Update: 2020-12-24 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరల పరుగులకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నా.. దేశీంయంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440, 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గింది. వెండి ధర ఏకంగా రూ.1500 పతనమై.. కిలో రూ.70,500లకు పడిపోయింది. మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,600లుగా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1881 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 26 డాలర్లకు ఎగసింది.

 

Tags:    

Similar News