గుండాలలో ఉన్న ఆ దేవస్థానం కాశీతో సమానం.. బుర్ర వెంకటేశం ఐఎఎస్
దిశ, వెల్దండ: జీవితంలో ప్రతి ఒక్కరు మంచి మార్గంలో నడవడానికి దైవచింతనే అనువైన మార్గమని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఐఎఎస్, ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. గుండాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ దక్షిణ కాశీ గుండాల అంబరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని శుక్రవారం శివపార్వతుల కళ్యాణం, కార్తీక దీపోత్సవం, అన్నదాన కార్యక్రమం హృదయ భారతి, స్వర్ణ పుష్పము చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో […]
దిశ, వెల్దండ: జీవితంలో ప్రతి ఒక్కరు మంచి మార్గంలో నడవడానికి దైవచింతనే అనువైన మార్గమని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఐఎఎస్, ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. గుండాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ దక్షిణ కాశీ గుండాల అంబరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని శుక్రవారం శివపార్వతుల కళ్యాణం, కార్తీక దీపోత్సవం, అన్నదాన కార్యక్రమం హృదయ భారతి, స్వర్ణ పుష్పము చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా బీసీ సంక్షేమశాఖ బుర్ర వెంకటేశం ఐఎఎస్, ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఏడు గుండాలతో పుణితమైన ఈ గుండాల అంబరామలింగేశ్వర శైవక్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక్కటైన కాశీ దేవస్థానంతో సమానమని అన్నారు.
వెల్దండ మండల కేంద్రంలో గుండాల ఆలయ ముఖద్వార నిర్మాణానికి అయ్యే ఖర్చు సమకూరుస్తానని సింగిల్ విండో వైస్ ఛైర్మన్ వావిల్లా సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హృదయ భారతి చైర్మన్ డా. మక్కపాటి మంగళ నరసింహ్మ రావు, కవులు కసి రెడ్డి వెంకట్ రెడ్డి, మనప చెన్నప్ప, ఉమాపతి నారాయణ శర్మ, సీఐ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యెన్నం భూపతి రెడ్డి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, తహశీల్దార్ కృష్ణ, ఎస్ఐ నరసింహ్మ, అన్నదాత కొత్తపల్లి దుర్గా రెడ్డి దీప్తి, రాగిచెడు శివ ఆలయ అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.