తెలంగాణ పరిశ్రమల్లో ఇక స్థానికులకు ఉద్యోగాలు..

దిశ, తెలంగాణ బ్యూరో:  రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ ప్రొగ్రామ్ ర్యాపిడ్​ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్​ అండ్​ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్ (టి-ప్రైడ్​), తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ డెవలప్మెంట్​ అండ్​ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్(టి.ఐడియా) పథకాల కింద రాయితీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టి-ఐడియా, టి-ప్రైడ్​ పథకాల కింద స్థానికులకు ఉపాధి కల్పించేందుకు జీఓ నం.20 ద్వారా శుక్రవారం మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆపరేషనల్​ గైడ్ […]

Update: 2020-11-13 09:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ ప్రొగ్రామ్ ర్యాపిడ్​ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్​ అండ్​ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్ (టి-ప్రైడ్​), తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ డెవలప్మెంట్​ అండ్​ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్(టి.ఐడియా) పథకాల కింద రాయితీలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టి-ఐడియా, టి-ప్రైడ్​ పథకాల కింద స్థానికులకు ఉపాధి కల్పించేందుకు జీఓ నం.20 ద్వారా శుక్రవారం మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆపరేషనల్​ గైడ్ లైన్స్‌ను పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్​ రంజన్​ విడుదల చేశారు. దానికనుగుణంగా స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధానాన్నితీసుకొచ్చారు. అందులో భాగంగానే అదనపు రాయితీలు, ప్రయోజనాలను కల్పించనున్నారు. స్థానికులకు కేటగిరీ వారీగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీలు, పెట్టుబడి రాయితీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ అప్​ గ్రేడేషన్ కోసం కూడా 50శాతం రాయితీలు ఇవ్వనున్నట్లు జీవో మార్గదర్శకాల్లోని సారాంశం.

కేటగిరి–1 : 70 శాతం సెమీ– స్కిల్డ్ మానవ వనరులు స్థానికులు ఉండాలి.
50 శాతం స్కిల్డ్ మానవ వనరులు స్థానికులు ఉండాలి.

కేటగిరి–2 : 80 శాతం సెమీ స్కిల్డ్ మానవ వనరులు స్థానికులై ఉండాలి.
60 శాతం స్కిల్డ్ మానవ వనరులు స్థానికులు ఉండాలి.

Tags:    

Similar News