బీసీసీఐ జీఎం సబా కరీంపై వేటు?
దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్ ) సబాకరీంపై వేటు పడనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడా సంస్థలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తాజాగా బీసీసీఐకి కూడా ఆ సెగ తగిలినట్లు సమాచారం. కరోనా కాలంలో తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలను పరిష్కరించడంలో సబాకరీం విఫలమయ్యాడని బోర్డు భావిస్తున్నది. ప్రస్తుత కష్టకాలంలో ఆఫీస్ బేరర్లు, ఇతర అధికారులను కలపుకుని వెళ్లి సమస్యను పరిష్కరించాల్సింది తానే సమస్యగా మారడం బీసీసీఐ పెద్దలకు […]
దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్ ) సబాకరీంపై వేటు పడనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడా సంస్థలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తాజాగా బీసీసీఐకి కూడా ఆ సెగ తగిలినట్లు సమాచారం. కరోనా కాలంలో తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలను పరిష్కరించడంలో సబాకరీం విఫలమయ్యాడని బోర్డు భావిస్తున్నది. ప్రస్తుత కష్టకాలంలో ఆఫీస్ బేరర్లు, ఇతర అధికారులను కలపుకుని వెళ్లి సమస్యను పరిష్కరించాల్సింది తానే సమస్యగా మారడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. టీమ్ఇండియా మహిళా జట్టు వ్యవహారాల్లో ఎక్కువ చొరవ తీసుకోవడంపై కూడా బోర్డు గుర్రుగా ఉంది. ఇక దేశవాళీ క్రికెట్‌లో కోల్పోయిన సమయాన్ని ఎలా రీషెడ్యూల్ చేయాలనే విషయంపై క్రికెట్ ఆపరేషన్స్ జీఎంగా ఉంటూ దృష్టి పెట్టలేదని, రాష్ట్రాల అసోసియేషన్లు కూడా అతడిని సంప్రదించినప్పుడు దురుసుగా ప్రవర్తించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేషనల్ క్రికెట్ అకాడమీ, అంపైర్స్ అకాడమీ తదితర విభాగాలకు సంబంధించిన బాధ్యతలను కూడా సబా కరీం సరిగ్గా నిర్వర్తించలేకపోయాడని తెలుస్తున్నది. ఇప్పటికే ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్స్ తమ సీఈవోలను మార్చే పనిలో ఉన్నాయి. కరోనా సంక్షోభ సమయంలో సరిగ్గా వ్యవహరించకపోవడమే వీరు చేసిన తప్పు. అలాంటి తప్పులే జీఎం సబా కరీం కూడా చేసినట్లు బీసీసీఐ గుర్తించింది. ప్రస్తుతం అతడిపై పూర్తి పర్యవేక్షణ పెట్టింది. నేడో, రేపో సబా కరీంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.