గుడ్ న్యూస్.. సైనిక్ స్కూళ్లలో విద్యార్థినులకు అనుమతి
దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు సైనిక్ స్కూల్స్‌లో బాయ్స్ మాత్రమే చదువుకుంటుండగా, ఇకపై గర్ల్స్‌కు కూడా ఇందులో చదివే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని 33 సైనిక్ స్కూళ్లలో ఈ అకడమిక్ ఇయర్(2021-2022) అడ్మిషన్ కోసం విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మిజోరాంలోని చింగ్‌చిప్ సైనిక్ స్కూల్‌లో గర్ల్ క్యాడెట్స్‌కు 2018-19లో అడ్మిషన్ చేయించి, టెస్ట్ చేశామని కేంద్రమంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. అది సక్సెస్ […]
దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు సైనిక్ స్కూల్స్‌లో బాయ్స్ మాత్రమే చదువుకుంటుండగా, ఇకపై గర్ల్స్‌కు కూడా ఇందులో చదివే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని 33 సైనిక్ స్కూళ్లలో ఈ అకడమిక్ ఇయర్(2021-2022) అడ్మిషన్ కోసం విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మిజోరాంలోని చింగ్‌చిప్ సైనిక్ స్కూల్‌లో గర్ల్ క్యాడెట్స్‌కు 2018-19లో అడ్మిషన్ చేయించి, టెస్ట్ చేశామని కేంద్రమంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. అది సక్సెస్ అయిందని.. సైనిక్ స్కూల్‌లో చదివిన గర్ల్స్, బాయ్స్ మంచి ఫలితాలు సాధించారని, వీటి ఆధారంగా ప్రస్తుత అకడమిక్ ఇయర్‌కు అన్ని సైనిక్ స్కూళ్లలో గర్ల్స్‌ను అనుమతిస్తున్నామని చెప్పారు.