పెళ్లి కాకుండానే తల్లులు.. మొగ్గు చూపుతున్న యువతులు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపొయింది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు పోయి, చేతిలో డబ్బులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక అవసరాలు మనిషి ఏ పని చేయడానికైనా వెనుకాడకుండ చేస్తాయి. బ్రతకడానికి డబ్బు అవసరమై, తప్పని పరిస్థితిలో తప్పు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్న వేళ.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు చాలా మంది […]

Update: 2021-05-31 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపొయింది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు పోయి, చేతిలో డబ్బులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక అవసరాలు మనిషి ఏ పని చేయడానికైనా వెనుకాడకుండ చేస్తాయి. బ్రతకడానికి డబ్బు అవసరమై, తప్పని పరిస్థితిలో తప్పు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్న వేళ.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు చాలా మంది అమ్మాయిలు సర్రోగేట్ తల్లులుగా మారుతున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పని .. గుజరాత్ లో గుప్పుమంది.

భర్త లేని ఆడవారు, ఆర్థికంగా వెనకబడిన అమ్మాయిలు, తండ్రి ఆదరణ లేని కూతుళ్లు, ఉద్యోగం లేక పిల్లల్ని చదివించుకోలేని తల్లులు ఇలా వీరందరూ సర్రోగేట్ తల్లులుగా మారుతూ డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు ఉండి, పిల్లలు లేని వారికి వీరి గర్భాన్ని అద్దెకు ఇచ్చి వారిని తల్లిదండ్రులుగా మారుస్తున్నారు. దీనికోసం వీరు భారీగానే డబ్బు అందుకుంటున్నారు. ఇక ఇందులో ఎక్కువగా పెళ్లికాని యువతులు ఉండడం గమనార్హం. “ఈ కరోనా సమయంలో నా ఉద్యోగం పోయింది.. మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి..ఇలాంటి సమయంలోనే ఈ సరోగసీ గురించి తెలిసింది. వేరే ఏ మార్గం లేక ఒక డబున్న వారి బిడ్డను నా గర్భంలో మోస్తున్నాను. అందుకు వారు నాకు కొంత డబ్బు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఆర్థికంగా కొంత వెసులుబాటుగా ఉన్నదని” ఓ యువతి తన కన్నీటి గాధను తెలిపింది.

పెళ్లి కాకుండానే తల్లి అవ్వడమనేది మన సమాజంలో ఎంతటి అవమానకరమైన విషయమో అందరికి తెలిసిందే.. ఈ విషయం తెలిసాక వీరికి పెళ్లిళ్లు అవవుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ, ఇప్పుడు తాము బ్రతకడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని, సమాజం ఎంత చిన్నచూపు చూసినా మా అనుకున్నవారి కోసం ఇలాంటి సాహసం చేయక తప్పడంలేదని సరోగసీ చేయించుకున్న మహిళలు తెలుపుతున్నారు. “గతేడాది వరకు బాగానే ఉన్నాం. ఇటీవలే నా భర్త ఉద్యోగం పోయింది. అటు అత్తవారింటి నుంచి, మా ఇంటినుంచి ఆర్థికంగా ఏమి ఆశించలేని పరిస్థితి. ఇంట్లో సరుకులు లేక ఎన్నో రోజులు పస్తులు ఉన్నాం.. ఇలాంటి సమయంలో నా భర్త పనిచేయడానికి కూడా ఏ పని దొరకలేదు. దాంతో పస్తులుండకుండా చూసుకునేందుకు ఇంట్లోని వస్తువులను నా భర్త అమ్మేశాడు. ఇంక వేరే మార్గం లేకపోవడంతో భర్తను ఒప్పించి సర్రోగేట్ తల్లిగా మారానని” ఓ వివాహిత తెలిపింది.

చాలా రాష్ట్రాల్లో సర్రోగేట్ పద్దతి కొనసాగుతుంది. గుట్టుచప్పుడు కాకుండా ఎంతోమంది యువతులు పిల్లల్లు లేనివారికి తమ గర్భాన్ని అద్దెకు ఇస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇక ఈ కేసులు గుజరాత్ లో ఎక్కువ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 20-25 కేసులు కేవలం గుజరాత్ లోనే వెలుగు చూడడం గమనార్హం. ఇలా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు తాళలేక, తమ కుటుంబాలను రక్షించుకోవడం కోసం తప్పని తెలిసినా ఇలాంటి పనులు చేయడానికి ఒప్పుకోవడం విచారకరం.

Tags:    

Similar News