201 బస్‌షెల్టర్ల పునర్ నిర్మాణానికి ఆమోదం
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రేటర్ పరిధిలో 201 బస్‌షెల్టర్లను పునర్నిర్మించేందుకు నాలుగు ప్యాకేజీల కింద టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీలో 34 ఎంజెండాలపై చర్చించి ఆమోదించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలను వసూళ్లకు ఎరియర్స్‌పై విధించిన వడ్డీలో 80 శాతం వరకు మాఫీ చేసి అండర్ వన్‌టైం ఆమ్నెస్టి స్కీం కింద వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040-211 […]
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రేటర్ పరిధిలో 201 బస్‌షెల్టర్లను పునర్నిర్మించేందుకు నాలుగు ప్యాకేజీల కింద టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీలో 34 ఎంజెండాలపై చర్చించి ఆమోదించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలను వసూళ్లకు ఎరియర్స్‌పై విధించిన వడ్డీలో 80 శాతం వరకు మాఫీ చేసి అండర్ వన్‌టైం ఆమ్నెస్టి స్కీం కింద వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040-211 11 111 సేవలను మరో మూడు సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. రోడ్ల పక్కన నిర్మించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిర్మాణ వ్యర్థాలు, చెత్తచెదారం ఉంటుందని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా చేయడానికి చొరవ తీసుకోవాలని అధికారులకు, కార్పొరేటర్లకు విజ్ఞఫ్తి చేశారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, సమీనబేగం, మహ్మద్ అబ్దుల్ రెహమాన్, ముస్తఫా అలీ, మిస్‌బా ఉద్దీన్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, యం.మమత, ఎక్కెల చైతన్య కన్నా తదితరులు హాజరయ్యారు.